సుమా!



పొలుసులు 

పొలుసులుగా

విక్షేపం చెందేది


కుబుసాన్ని విడిచి

తాజా తొడుగు 

తొడుక్కునేది


తీరి కూచుని

కసి బుసలు కొట్టేది


చుట్ట చుట్టుకొని

ఎట్లాగో పడి ఉండేది


ఈ మనసే


జరజరజరా 

పైకి లేచి

అనంతాకాశాలలోని

అమృత శక్తి వైపుకి

పడగెత్తి నిలిచేది.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు