భ్రమప్రమాదములు



నేనెప్పుడూ

ఏదో ఒక భ్రమను

ప్రేమిస్తూ ఉంటాను


ఆ భ్రమ కూడా

నన్ను అంతే

గాఢంగా ప్రేమిస్తోందని

భ్రమిస్తాను


వేయి గేలాలతో

లాగే భ్రమలోకి

మంత్రించినట్టు

నడుచుకు పోతాను


భ్రమ కప్పే

రంగుల 

పరదాలు

దట్టమైనవి

తొలగించ 

వీలుకానివి


భ్రమ

సంభ్రమం

తబ్బిబ్బు

చేస్తుంది


భ్రమ 

భ్రమరం

సౌందర్యపానంతో

మత్తిల్లజేస్తుంది


భ్రమ 

విభ్రమం

భరించడం

భారమౌతుంది


భ్రమను

చీల్చగలిగేది

కాలం ఒక్కటే


ఆ చీలికలోంచి

వచ్చేది

మిరుమిట్లుగొలిపే

సత్యం


ఆ 

సత్యం

అప్పుడే 

పుట్టిన

పచ్చి రెక్కలనిచ్చి


భ్రమావరణానికి

అందనంత ఎత్తులో

ఎగిరిపొమ్మని

గర్జిస్తుంది.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు