రాయి కవిత




1. గుహ                                  
     *****
చల్లని చీకట్లలో
కాంతి మునకలు వేస్తుంది
చిత్రమైన మలుపులలో
గాలి మెలికలు తిరుగుతుంది
 
పైన్నించి నీటిచుక్క
దీక్షగా కిందికి దూకుతుంది
నా ఇల్లు నా ఇల్లిదని
గబ్బిలాయి చక్కర్లు కొడుతుంది
 
మెత్తని మన్ను కింద పురుగొకటి
నింపాదిగా పాకుతుంది
కళ్ళు లేని చేప నీళ్ళల్లో
తీరుబడిగా తోక ఊపుతుంది
 
మహాకాయ బండరాయి
పాకుడు కప్పుకు నిద్రపోతుంది
నోరంతా తెరిచిన ముసలి గుహ
ఓయంటే ఓహోయని కేక వేస్తుంది.​


2. బండ

  **********


పూలు రాలి పడ్డప్పుడు
పులకరించి పోకుండా

చినుకు జారి పడ్డప్పుడు
కరిగి నీరై పోకుండా

దుమ్ము మీద పడినప్పుడు
చీకాకు పడిపోకుండా

కనులు మూసి ఋషిలాగా
కదలకుండ
మెదలకుండ
కాలానికి లొంగకుండ…



 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన