అన్నమయ్య పలుకుబళ్ళు ఆరు

 1. అగ్గి పొంతనున్న వెన్న

  *****************************


చింతల వేదనల జిక్కువడచునగ్ని

పొంతనున్న వెన్నయైపోయెగాలము


2. అడవిగాసే వెన్నెల

 ************************


జాడలు మెచ్చాలేరు

చాలునన్న వారు లేరు

వేడుక నడవిగాసే వెన్నెలాయ బ్రదుకు.


3. ఆటలో బ్రాహ్మణుడు

*************************


అన్ని కర్మములు జేసి 

ఆటలో బ్రాహ్మణుడనైతి

నన్ని వేదముల నేటి యంగడి వీధి.


4. ఆకాశమడ్డమా అవ్వలయునడ్డమా

   ***************************************


ఆకాశమడ్డమా అవ్వలయునడ్డమా

శ్రీకాంతు భజియించు సేవకులకు.


5. ఆకాశము పొడవు ఆకాశమే యెరుగు

    *****************************************


ఆకాశము పొడవు ఆకాశమే యెరుగు

ఆకడ జలధి లోతు ఆ జలధే యెరుగు.


6. అమరావతడ్డమా

     ********************

అమరావతడ్డమా హరిదాసులకు మహా

తిమిరంబులడ్డమా దివ్యులకును.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన