కవిత్వం-కవి

 మనసును నిశ్చలంగా ఉంచు,భావోద్వేగాలకు అతీతంగా అని చెబుతుంది యోగశాస్త్రం. భావోద్వేగాలే కవిత్వాన్ని పుట్టిస్తాయి కానీ, అవి చల్లారి మనసు నిశ్చలమయ్యాకే కవిత్వం పుడుతుంది ఏ కవికైనా. 


                                                                 

మరీ కిందికి వెళ్ళిపోకు 
పెను దుఃఖపు పాకంలోకి   

మరీ పైపైకి తేలిపోకు 
అమందానందపు ఆవిరిలోకి   

రెంటికీ మధ్యలో 
సన్న గీత ఉందే, 

సరిగ్గా అదిగో 
అక్కడే ఉండు.  

కవిత్వం హల్వాలా 
ఉడుకుతూ ఉంటుందక్కడ

కుతకుతలాడుతూ 
రెప్పలు వేస్తూ. 
 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన