RGV and his రాముఇజం

 



రాంగోపాల్‌ వర్మ గారు మా కాలేజీలోనే చదువుకున్నారు. 

మేం చదువుకునేటప్పుడు రాంగోపాల్‌ వర్మ ఎప్పుడూ ఇక్కడే కూచునే వాడట, ఇక్కడ తిరిగేవాడట, జేబులో కత్తి పెట్టుకుని తిరిగేవాడట అని చాలా కథలు చెబుతుండేవారు మా సీనియర్లు. నేను చదువుకునేటప్పుడు  RGV అక్కడ ఉండి ఉంటే ఖచ్చితంగా గురువు కమ్ స్నేహితుడిగా చేసుకుని ఉందును. అతను చెప్పేవాటికి అన్నింటికీ అంగీకరించను కానీ ఏ విషయం గురించైనా RGV analysis వేరే లెవల్లో ఉంటుంది. 
Creative persons ఎలా ఆలోచిస్తారనేది RGV మాటల్లో వినవచ్చు.

హృదయవ్యాపారం చాలా సంక్లిష్టమైనది.

రకరకాల భావోద్వేగాలు ఎగిసిపడి మొదట సంతోషం ఆనక అపరిమితమైన దుఃఖం కలిగించడం అందరికీ అనుభవంలో ఉన్నదే.
 
ప్రేమ సఫలమైనా విఫలమైనా చాలామందికి ఒడ్డుకు చేరాక దుఃఖమే కలుగుతుంది. బంధానికి,మోక్షానికి మనసే కారణమని చివరాఖరికి ఎరుక కలుగుతుంది.

చేరువైనా దూరమైనా ఆనందమే అనుకోగలిగితే వేదాంతం బాగా ఒంటబట్టినట్టే. ప్రేమ అనేది అందరికీ ఆసక్తికరమైన ఒక అంతులేని అధ్యయనాంశం. 

అలాగే నీ చుట్టూ ఉన్న ప్రపంచం, నువ్వు చూస్తున్న ప్రపంచం, నీలో ఉన్న ప్రపంచం,నీతో ఉన్నవారి ప్రపంచం అన్నీ వేరు,వేరు. ఈ ప్రపంచాలు మారుతూ ఉంటాయి. ఇది భారతీయ వేదాంతం బాగా వివరిస్తుంది. 

ప్రేమ గురించి,ప్రపంచం గురించి RGV విశ్లేషణ బావుంది. స్వప్న గారు ఈ రామూఇజం ఎపిసోడ్లు అన్నీ బాగా చేసారు. 

ప్రేమ గురించి RGV:


ప్రపంచం గురించి RGV:

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన