విందు

  



జిలుగు

చీరంచు 

వాలనీ 

కలకల 

నవ్వులని

అద్దుకోనీ   

బుగ్గలని 

మోహాల 

లేపనాలని

 

మసక దీపాల 

వెలుగుని

దొంగిలించనీ 

చూపుల 

కౌగిలింతని


వగలు పోనీ       

చెవి లోలాకులని  

 

పాటల చెలమల్లో  

తడవనీ కాళ్ళని

హొయలు పోనీ 

వేళ్ళని    

ఆడనీ 

ఇరుసుని 

నడుముని 

 

షాండ్లియార్

చిరు గోళాల 

చిత్ర కాంతుల్లో   

తలకెక్కనీ   

జీవన మధువుని

ఇంకా 

ఇంకా   

  

చుక్కా 

చుక్కా.

 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు