హలో,కార్సికా!
ఈమాటు ప్రపంచ తెలుగు మహాసభలు కార్సికా ద్వీపంలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది క్రౌంచద్వీపంలోని ఓ మెగా తెలుగు సంస్థ. ఇక నిర్వాహకుడు పెద్దిరాజు గారికి ఫోన్లు రావడం ప్రారంభమైంది. హలో!హలో! నేను అవధానరాజ,అవధాన గండభేరుండ,అవధాన వ్యాఘ్రాన్ని మాట్లాడుతున్నా. ఇన్ని చెప్పి నాపేరు చెప్పడం మరచా. నేను కీర్తివ్యామోహ రావుని మాట్లాడుతున్నా. హలో!హలో! అచ్చ ఇంగ్లీషులో అవధానం నా ప్రత్యేకత. దానికి రూపశిల్పిని నేనే. ఇంగ్లీషు ప్రపంచ భాష. ఏదేశం వెళ్ళినా అంతా ఇంగ్లీషే. అందుకే ఈ బ్రహ్మాండమైన ఆలోచన నాకు కలిగి అచ్చ ఇంగ్లీషు అవధానాన్ని రూపొందించా. పృచ్ఛకులంతా ఆంగ్లంలో ప్రశ్నలడుగుతుంటే నేను తెలుగు ఛందస్సులో ఆంగ్లభాషలోనే పద్యం చెబుతా. ఇది అన్నిచోట్లా బాగా క్లిక్కయ్యింది. నేను మొట్టమొదటగా దీన్ని ఆఫ్రికన్ ఏనుగుల సఫారీలో చేసా. నా టింగ్లీష్ పద్యాలు విని ఏనుగుల గుంపు ఒకటి నాకు సన్మానం చేయడానికి ఘీంకరిస్తూ వచ్చింది. ఆ విషయం అర్థం కాని పృచ్ఛకులంతా కకావికలురై పరుగులు తీసారు గానీ నేను చాలా తెలివైన వాడిని కనుక టింగ్లీషులో ఏనుగుల మీద సీస పజ్జాలు చెప్పి, వాటితో ఫొటో దిగి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ఫాన్సుకి ...