అడవి బాపిరాజు గారి “దీపం సెమ్మా” (1952)
కామాక్షీ దీపం గురించి వివరాల కోసం వెదుకుతుంటే అడవి బాపిరాజు గారు 1952 లో రచించిన “దీపం సెమ్మా” అనే కథ దొరికింది. ఇందులో వర్ణించిన దీపం సెమ్మా నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు కావాలంటే ప్రత్యేకంగా చేయించుకోవాల్సిందే.
“ఆ సెమ్మా శిల్పం పని అతి అందంగాను, నాజూకుగాను, అద్భుతంగాను వుంది. కిందమట్టు కమలం, అందులోంచి కాంతి తీగలా కలశాలు, చక్రాలు, కమలాలు, తీగెలు, తామరకాయలా పై కెదిగి అష్టదళ పద్మములా సెమ్మా ప్రమిద తెలిసింది. ఆ ప్రమిద మధ్య నుంచి ఒక తీగ పైకి పోయింది. ఆ తీగె చివర ఒక హంస చాలా ఒయ్యారంగా నిలిచి వుంది. ఆ హంస మీద సంపూర్ణ ప్రపుల్ల కమలం, దాని మీద పద్మాసనాసీన ఐన లక్ష్మీ-సరస్వతీ, చతుర్విధ పురుషార్ధాలు, విజ్ఞానవీణ, తాళాలు, అష్టహస్తాలతో పట్టుకొని హాసవిలాసంగా వున్న వదనంతో వెలిసి వుంది.”
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి