అయ్యగారికి దండం పెట్టు! అమ్మగారికి దండం పెట్టు!

 టీచరు: మీ పిల్లోడు బళ్ళో డల్‌ గా ఉంటున్నాడు, కౌన్సిలింగ్‌ ఇప్పించండి.


సైకియాట్రిస్టు: మీ పిల్లోడిని అనేక ప్రశ్నలు వేసి విషయం రాబట్టా. అతగాడి ఆత్మ ప్రస్తుతం ఉన్న శరీరంలో సుఖంగా లేదని నాకు తెలిసింది. డాక్టరుతో టెస్టులు చేయించండి.

డాక్టరు: ఓ మై గాడ్‌! సాధారణ మానవుడికి  గాస్ట్రోజన్ 30% ఉండాలి,  మీ వాడికి ‌ 29% మాత్రమే ఉంది! వెంటనే లింమాస్‌ చేయించకపోతే జీవితం ఇబ్బందైపోతుంది. మీవాడు దెబ్బైపోతాడు. 

తండ్రి: ఆ మాట వింటుంటేనే నా హృదయం ముక్కలైపోతోంది. అలాంటి పని నా బొందిలో ప్రాణముండగా చెయ్యను.

పత్రిక: శరీరంలో గాస్ట్రోజన్ తగు మోతాదులో లేకపోతే వెంటనే లింమాస్ చేయించుకోవాలి లేకపోతే కేన్సర్‌ వచ్చే అవకాశం 99%, ఎయిడ్సు వచ్చే అవకాశం 99.99%, 30 యేళ్ళకు మించి బతక్కపోయే అవకాశం 100% ఉందని శాస్త్రవేత్తలు నొక్కివక్కాణిస్తున్నారు.

న్యూస్‌ ఛానల్‌: ఈరోజు ఏలూరులో 100 మంది, నర్సాపురంలో 150 మంది, ఇంకా విశాపట్నంలో 40, చీరాలలో 20 మంది పైకి పోయారు. వీరంతా గాస్ట్రోజన్‌ 30% కన్నా తగ్గినా లింమాస్‌‌కు నిరాకరించిన వారు.

తండ్రి: ఓరి నాయనోయ్‌! ఏదో ఒకటి, నా పిల్లోడు బతికుంటే చాలు, వెంటనే లింమాస్‌ చేయిస్తా.

పక్కింటాయన: మావోడికి ఈమధ్యే లింమాస్‌ అయిందండీ. 
మృగన్నల గుళ్ళో వంద కొబ్బరికాయలు, రిఖండి గుళ్ళో తలనీలాలు ఇస్తానని  మొక్కుకున్నా. అంతా సక్రమంగా జరిగింది.


గురువు: శరీరం అనేది అత్మకు ఒక ఉపాధి మాత్రమే నాయనా! అది ఏ రూపంలో ఉంటే ఏం? కొడుకేమిటి, కూతురేమిటి? అంతా భ్రాంతి. సర్వం మాయ.

తండ్రి: సరే స్వామి. అలాగే. అంతా మా ఖర్మ.


పాతికేళ్ళ తర్వాత:

పత్రికా ప్రకటన: మా నాన్‌-లింమాస్‌ ‌ అబ్బాయికి నాన్‌-లింమాస్‌ ‌ అమ్మాయి కోసం చూస్తున్నాం. లింమాస్‌ అమ్మాయిలు please don’t apply.

లిబరల్స్: వివక్ష! వివక్ష! వివక్ష! ఇన్నేళ్ళ తర్వాత కూడా లింమాస్‌ మీద వివక్ష! దీనిమీదే మా పోరాటం! ఎర్రజండ్‌ ఎర్రజండ్‌ ఎన్నియల్లో!

ప్రభుత్వం: అటువంటి వివక్షాపూరిత ప్రకటన ఇచ్చిన వ్యక్తి మీద చట్టపరమైన చర్య తీసుకుంటున్నాం. ఆ ప్రకటన ఇచ్చిన తండ్రిని బొక్కలోకి తోసాం. 

సైంటిస్టులు: హిప్‌!హిప్‌!హుర్రే! ఇక లింమాస్‌కి ఆర్లెల్లు పట్టదు. కేవలం ఓ ఇంజెక్షన్‌ చేయించుకుని నిద్రపోతే చాలు, మరుసటి రోజుకల్లా A B అవుతుంది, C D అవుతుంది! చవులూరించే కొత్త జీవితం ఆరంభం!వావ్‌! What a great invention!!

ఆవిధముగా మానవజాతి పడండి ముందుకు, పడండి తోసుకుమనుకుంటూ పోతూ ఉండినది.

సమాప్తము.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన