ఏవిుటండీ మీరు మాట్లాడేది??


 

భాషేష్‌: నేను చాలా చాలా శోధించి బర్మనీ,డబ్రూ గ్రంథాలు మరగేసి కనుక్కున్న రహస్యాలు నీతో పంచుకుంటున్నా. ఈ రహస్యాలు నువ్వు అందరితో పంచుకోవాలి,తెలిసిందా?


మన దేవుళ్ళంతా ఆటవిక జాతుల టోటెమ్స్ నుండి వచ్చారు.
అంటే వారి జెండా గుర్తుల కాంబినేషన్‌ల నుండి. 

రెండు ఆటవిక జాతుల మధ్య ఫైటింగ్‌ జరిగి, తరువాత సంధి చేసుకుంటే, రెండు గుర్తులు కలిపి ఒక గుర్తు చేస్తారన్న మాట. 

సింహం గుర్తు + మనిషి గుర్తు= నరసింహ స్వామి; 
ఏనుగు గుర్తు+ మనిషి గుర్తు= వినాయకుడు 

ఇలాగన్న మాట. తెలిసిందా? 

చారి: ఏవిుటండీ మీరు మాట్లాడేది??

భాషేష్‌: ఇంకా విను. ఒకవేళ ఒక జాతి మరో జాతి చేతిలో ఓడిపోయిందనుకో, ఓడిపోయిన జాతి టోటెంని  గెలిచిన జాతి టోటెంకి వాహనంగా చేసేవారు. 

వినాయకుడికి ఎలక, కుమారస్వామికి నెమలి ఇలా. తెలిసిందా? 

ఈ అల్లిబిల్లి కతలన్నీ కలిపి కుట్టి “టోటెం పురాణం” ఒకటి రాస్తున్నా. పూర్తవగానే నీకో కాపీ పంపుతా. 

చారి: ఏమిటండీ మీరు మాట్లాడేది??

రంధ్రాన్వేషణమ్మ: రాముడు,సీత అడవిలో లక్ష్మణుడి చేత వెట్టిచాకిరీ చేయించేవారు. లక్ష్మణుడు పుల్లలేరుకొస్తే సీత ఉప్మా చేసేది. రాముడు,సీత తిన్నాకే లక్ష్మణుడు తినాలంట. ఎంతన్యాయమండీ? చల్లారిపోయిన ఉప్మా ఎవరైనా తినగలుగుతారా?

 అడవిలో ఉన్నంత కాలం సీత పాదాలు చూసే మాట్లాడేవాడంట లక్ష్మణుడు. మొత్తం అన్ని నెలలూ మొహం చూడకుండా మాట్టాడ్డం అవ్వుద్దా అసలకి? 

రాముడికి కాళ్ళు పట్టడానికి సీత ఉంది. మరి వెట్టిచాకిరీ చేసే లక్ష్మణుడికి కాళ్ళు పట్టేదానికి ఆ అడివిలో దిక్కు లేదు చూసారా? ఎంతన్యాయమండీ?

చారి: ఏమిటండీ మీరు మాట్లాడేది??

రంధ్రాన్వేషణమ్మ: మనకు రాముడు వద్దు. భీముడు పనికిరాడు. మనదేశానికి కావాల్సింది కోరల మార్కుడు.

చారి: ఏమిటండీ మీరు మాట్లాడేది??

తిరుగుబాట్రావ్‌: పూర్వం స్త్రీలకి ఇనప కచ్చడాలు వేసేవారు. వాటి అవశేషాలే వడ్డాణాలు. వాటిని వలిచిపారెయ్యాలి. ఇది నా ఆస్తి అని చెప్పడానికి మెళ్ళో బిళ్ళ వేసేవారు. అదే తాళిబొట్టు. దాన్ని అవతల పారెయ్యాలి. పైట పితృస్వామ్య అవస్థకి గుర్తు. దాన్ని తగలెయ్యాలి. ఇంకా ఆడదాని ముక్కుకి తాళ్ళేసేవారు. దాని అవశేషమే ముక్కుపుడక. దాన్ని చెత్తలో పారెయ్యాలి. అన్నీ తీసి అవతల పారెయ్యాలి. అప్పుడే విముక్తి.

చారి: ఏమిటండీ మీరు మా..మా…??


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన