Oh,Baby! Don’t break my heart!

 “PK తో హృదయాన్ని తెరువుము” అన్న సుప్రసిద్ధ కార్యక్రమాన్ని, తన సుప్రసిద్ధ ఛానెల్లో, మన సుప్రసిద్ధ PK నిర్వహించడం అనేది తరతరాలుగా తెలుగువారి సంప్రదాయంగా వస్తోంది. 


PK: మీరు తీసుకోనని చెప్పుకుంటారు కానీ మీ ప్రసంగాలకు ఎనకమాలగా డబ్బులు తీసుకుంటారని బయట టాకు. 

ప్రవచనకారుడు:  PK గారు,  ప్రవచనాలకు తాంబూలం పుచ్చకోవడం తప్పేమీ కాదు కదండీ. పుచ్చుకోవడమెందుకు? పుచ్చుకుని, పుచ్చుకోలేదని చెప్పుకోవడమెందుకు? ఎందుకొచ్చిన ఖర్మ చెప్పండి? ఒకవేళ పుచ్చుకోదల్చుకుంటే మీ అందరి ఎదుటా అడిగే పుచ్చుకుంటాను. నేనింత వరకూ నా ప్రసంగాలకు పైసా పుచ్చుకోలేదు, ఇక మీదట పుచ్చుకోను.

PK: ఆ, ఇచ్చినా ఎంతలేండి? ప్రసంగానికి పదేలన్నా ఇత్తారా?            
        కిక్కిక్కిక్కీ…

PK: మీకు ఆ రోజుల్లో ఫలానా హీరోతో “రికరిక” అని ఇండస్ట్రీలో గుసగుస. 

సీనియర్‌ నటీమణి: అయ్యో, బాబు PK, ఆ నటుడూ పోయాడు, నేనూ చివరి రోజుల్లో ఉన్నా. అవ్వన్నీ ఇప్పుడెందుకు బాబు?

PK: వృద్ధనారీ పతివ్రతః అంటారు, అంతేగా? 
       కిక్కిక్కిక్కీ…


PK: మీరు మంత్రిగా చాలా లంచాలు పట్టి బాగా ఎనకేసారని లోకమంతా కోడై కూస్తాంది.

మంత్రి: నేను చాలా నిజాయితీ మనిషిని. నేను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.

PK: తీసుకోకుండా ఎట్టవుద్దిలేండి. తప్పదు. ఎంతెనకేసుంటారు?
        ఓ వందకోట్లుంటయ్యా?
         కిక్కిక్కిక్కీ…


PK: మీ “లపాకీ తో జపాకీ” అన్న టైటిల్‌ చాలా interesting గా ఉంది. అసలికా ఐడియా ఎట్టొచ్చింది మీకు? 

అస్మదీయుడు: మేం ఆ name గురించి రోజుకి 72 గంటలు కష్టపడ్డాం. అంతా ఆర్డు వర్కు. టీం వర్కు. కింద వందమంది పనాళ్ళని బెట్టించి రాయిపించాం. 

PK: ఓకే.ఓకే. పని చేయించాలంటే మనాళ్ళకే అవ్వుద్ది. మీ సినిమా పెద్ద సక్సెస్‌ అయ్యి అవార్డులు కొట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన