పాట కచేరీ
పాట కచేరీ
————-
నేను
పాటకచేరీకి
వెళతాను
కులుకు
కన్నుల
పట్టు కోక
చుట్టి
సుఖాసీననై
సనసన్నని
రాగాలలా
సన్నజాజుల
మీదుగా
నా వజ్రపు
దిద్దులను
మీటుతోంటే
హాయిలోన
లీననై
రాగానికీ
రాగానికీ
రంగురంగుల
భావచిత్రాలు
వసంతోత్సవాలుగా
మెరసి
మరచినవేవో
మంచి సంగతులు
చిన్న నవ్వులు
పూయించి
పురాతన
కాంక్షలేవో
దేహళీ దత్త
దీపాల్లా
మెల్లిమెల్లిగా
లోలోన
జ్వలించి
కరతాళములతో
జత కలిపిన
దేహాన్ని దాటి
చల్లగాలుల
గంధర్వ లోకాన్ని
సభను దాటి
పెనుచీకటులు
దాటి,దాటి
నా ఆత్మ
ఆనంద నర్తనల
విస్ఫులింగాలుగా
విడిపోవడాన్ని
లోకన్నులు
విప్పార్చి
వీక్షించి
విస్మయం
చెందిపోవడానికి
నేను
పాటకచేరీకి
వెళతాను
( Written after coming back from Ranjani-Gayatri concert, RaGa with Raja on Saturday,29th,April 2023.)