అంతేగా! అంతేగా!


 

తెలుగు రచయిత‌1: నాకు బట్టతల,చట్టిముక్కు ఇత్యాది కారాణాల వల్ల కలిగిన ప్రేమ వైఫల్యాలు,ప్రేమ పిచ్చివాడ్ని,పాత్రలేని బిచ్చగాడ్ని చేసిన ఘటనల వల్ల కలిగిన డిప్రెషన్లు,కంప్రెషన్లు,ఇన్‌ డైజెషన్లు వల్ల కలిగిన డిప్రైవేషన్లలను కతలరూపంలో వ్రాసి వ్రాసి చాలా చాలా పేరు అదీ ఇదీ సంపాదించి ప్రస్తుతం అవార్డుల లిస్టులో చాలా డిప్రెస్డ్ గా వెయిట్‌ చేస్తున్నా. నేనో గొప్ప రచయితనని మీరు గుర్తించి తీరాలి.


అయోమయ తెలుగు పాఠకలోకం: అంతేగా! అంతేగా!

తెలుగు రచయిత2: నాకు మనుస్మృతి అంటే తెలీదు. నా జీవితంలో చూడలేదు. అయినా దాన్ని తగలెట్టాలని కతలు రాస్తా. రామాయణం టీవీలో చూడ్డమే తప్ప ఎప్పుడూ చదివే తీరిక దొరకలేదు. అయినా రావణాసుడు గొప్పవాడని,శూర్పణఖ మాఇంటి ఆడపడుచు అని కతలు రాస్తా. నాకతలన్నీ సూపర్‌ హిట్‌. ఆల్రెడీ నాకు ఎన్నెన్నో అవార్డులు వచ్చాయిగానీ నేను అలుపెరగకుండా నేను ఎప్పుడూ మొహం కూడా చూడని పురాణాల మీద, దేవుళ్ళ మీద పుస్తకాల మీద పుస్తకాలు రాసి బళ్ళకెత్తిస్తున్నా. 

అ.తె.పా: అంతేగా! అంతేగా! 

తెలుగు కవి1: పొద్దున్నే పేపరు చూస్తా. అన్ని ముఖ్య వార్తల మీద కవితలు గిలికి మళ్ళీ ఆ వార్తాపత్రికలకే కవితల విభాగానికి పంపుతా. రైతులు Vs ప్రభుత్వం అనుకోండి, రైతుల తరఫున ప్రభుత్వాన్ని బూతులు తిడుతూ ఓ కవిత రాస్తా. ప్రభుత్వ పాలసీలు ఏమిటి, అవి రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇత్యాది కారణాలతో మనకు సంబంధం లేదు. కవితల మీద కవితలు దొర్లించడమే మన పని. తాడిత పీడిత జనుల పక్షాన గళమెత్తి, పిడికిలి బిగించి కాఫీలు తాగుతూ, సిగిరెట్‌ పొగ వదులుతూ కవితల పుస్తకాలు తెస్తూ ఉంటా. 

అ.తె.పా: అంతేగా! అంతేగా!

తెలుగు కవి2: నీ అధారాలు మధురాలు, నీ నడుము ఓ కుడుము అని వైనవైనాలుగా వర్ణించుకుంటూ ముప్పొద్దులా మహా మహా రచైత చలానికి పూజలు చేస్తూ హారతులుస్తూ, వయసుతో సంబంధం ఏమిటి బ్రదర్‌? మనసెప్పుడు యంగే. Boys are boys! ఎప్పటికీ వృద్ధాప్యం రాదు! యవ్వనం పోదు! నా కవితలు నవ యవ్వన జవ్వనులు! స్వర్గలోకపు తామరలు!  జై చలం! జైజై చలం! 

అ.తె.పా: అంతేగా! అంతేగా!

మన అమాయక తెలుగు పాఠకలోకాన్ని చూసి వెంకీ మామ నేర్చుకున్నాడో, వెంకీ మామను చూసి వీళ్ళు నేర్చుకున్నారో? 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన