ఆడ్నెవరికైనా సూపించండ్రా!

భాషేష్‌: నేను నా వ్యాసాల్లో వేదాల్లోంచి Quote చేస్తా. కానీ వేదాలంటే నాకేమీ remote గా కూడా గౌరవం లేదు. నేను పురాణాలను, ఇతర హిందూ మత గ్రంథాలను పరామార్శిస్తా, తరువాత వాటిని నా వ్యాసాల్లో విమర్శిస్తా. 

అరుగు మీది పెద్దాయన: రేయ్‌, ఆడ్నెవరికైనా సూపించండ్రా! అలా వదిలెయ్‌కండ్రా బాబు ఆడ్నలాగ. కూసోబెట్టి సెప్పండ్రా. 

రబ్బర్‌‌: నేను తెలుగు పత్రికల్లో బొమ్మలేస్తా కానీ వాటిల్లో తెనుగుదనం జయమాలిని డాన్సులాగా కనిపించీ కనిపించకుండా ఉండేటట్టు మానేజ్‌ చేస్తా. హిందూ దేవుళ్ళను కామెడీగా గీస్తా. నా మతాన్ని మాత్రం జాగ్రత్తగా మోస్తా.

అరుగు మీది పెద్దాయన: రేయ్‌, ఆడ్నెవరికైనా సూపించండ్రా! అలా వదిలెయ్‌కండ్రా బాబు ఆడ్నలాగ. కూసోబెట్టి సెప్పండ్రా. 

జెఫ్పా: నేను, నా పత్రిక, హిందువుల మీద, హిందువుల వల్ల నడుస్తున్నా, నా పత్రికను హిందూ దేశాన్ని, హైందవాన్ని తిట్టిపోయడానికి వాడతా. బయట మాత్రం చక్కెర పూసిన మాటలు మాట్టాడతా.

అరుగు మీది పెద్దాయన: రేయ్‌, ఆడ్నెవరికైనా సూపించండ్రా! అలా వదిలెయ్‌కండ్రా బాబు ఆడ్నలాగ. కూసోబెట్టి సెప్పండ్రా. 

మిస్‌గైడెడ్‌ మిస్సయ్య: నేను మొన్నటిదాకా “అ” వాదిని. ఇప్పుడు అందులోను అన్యాయం ఉందని గ్రహించా. “అ” లోంచి “అఅ” వర్గం, “అఆ” వర్గం ఏర్పడ్డాయి. నేను “అఅ” లో చేరి కొంతకాలం మైదానాల్లో పని చేసా. అదీ మోసమే అని తెలుసుకున్నా. అందులోంచి వచ్చిన “అఅఆ” సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడినై కొన్నాళ్ళు దానికోసం పని చేసా. అదీ రివిజనిస్టు బూర్జువా ఎక్సెట్రా అని తెలుసుకున్నా. ఈలోపల “ఇఈ” లో చేరి అదంతా తప్పుడు సిద్ధాంతం అని తెలుసుకుని బయటకు వచ్చేటప్పటికి వయసైపోయింది. ఇప్పుడు అన్నింటికీ “ఉఊ” అంటున్నా. 

అరుగు మీది పెద్దాయన: రేయ్‌, ఆడ్నెవరికైనా సూపించండ్రా! అలా వదిలెయ్‌కండ్రా బాబు ఆడ్నలాగ. కూసోబెట్టి సెప్పండ్రా. 

దారిన పోయే దానయ్య: పెద్దాయనా, ఇందాకట్నించీ వింటున్నా. ఈళ్ళందర్నీ ఎవరికి సూపించాలంటా? 

ఇంకెవరికిరా, మన ఎర్రగడ్డ పిచ్చాస్పత్రాళ్ళకి. అని నవ్వి, కండువా దులుపుకుని ఊళ్ళో రాములోరి భజన మొదలైందని చక్కా పోయాడు,అరుగు మీది పెద్దాయన.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన