తాడి చెట్టెక్కలేవు!

 

Facebook Uncle: పుస్తకాలు చదివి ఎవ్వరూ మారరు. 


The Logical Indian: ఫలానా పుస్తకం తమ జీవితం మీద ఎంతో ప్రభావం చూపిందని, తమ ఆలోచనావిధానాన్ని మార్చిందని చెప్పిన వారు ఎంతోమంది ఉన్నారు. గొప్ప పుస్తకంలో ఏ విషయం ఎంత వరకూ,ఎలా నిన్ను ఆకర్షిస్తుందో అది నీ మానసికస్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. గుడికి వెళ్ళి దివ్య మంగళ మూర్తిని చూస్తావో, అక్కడ కూడా గుడికొచ్చిన ఆడవారిని చూస్తావో, నీ స్థాయిని బట్టి ఉంటుంది. పుస్తకంలో జ్ఞానం అందుకున్న వారికి అందుకున్నంత మహదేవ. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు అన్నట్టు.

Facebook Uncle: 🤐🤐🤐


Facebook Aunty: ఆడా మగా సమానమే.

The Logical Indian: శారీరకంగాను, మానసికంగాను అనేక భేదాలున్న జీవులు వారిరువురు. ఒకరికొకరు complement కాగలరు గానీ ఒకరినొకరు replace చెయ్యలేరు. సమానం అన్నది రుద్దుడు ప్రచారం. అప్ప సిరి చూసుకుని చెల్లెలు మడమలు విరగ్గొట్టుకుందన్నట్టు.

Facebook Aunty: 🤐🤐🤐

Facebook Uncle: సాహిత్యం వేరు. మనిషి వేరు. సాహిత్యంలోని గొప్పదనాన్ని చూడాలి గానీ ఆ సాహిత్యం సృష్టించిన మనిషిలోని బలహీనతలను చూడరాదు. 

The Logical Indian: రాసే రాతలకి చేసే చేష్టలకి సంబంధం ఉండదు అనడం అవకాశవాదం. అంగిట బెల్లం-ఆత్మలో విషం అన్నట్టు.

Facebook Uncle: 🤐🤐🤐


Facebook Uncle: బీద పిలకాయలకి ఇంగ్లీషొద్దా? బళ్ళల్లో ఇంగ్లీషు మీడియం పెట్టడం రైటే.

The Logical Indian: ఇంగ్లీషును ఒక విదేశీ భాషగా నేర్పించవచ్చు. తెలుగు లేకుండా చేయడమంటే పిల్లలను తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు పదసంపదలనే తల్లివేరు నుండి కత్తిరించి పడేయడం. అంతా ఇంగ్లీషు మయం చేయాలన్న ఆత్రం తెలుగు జాతికే ఆత్మహత్యా సదృశం. ఆరాటాల పెళ్ళి కొడుకు పేరంటాళ్ళ వెంట బడ్డాడన్నట్టు.

Facebook Uncle: 🤐🤐🤐


Facebook Aunty: చిన్నతనంలో తండ్రి,సోదరులు, తరువాత భర్త, ఆ తరువాత కొడుకు రక్షణలో ఉండాలిట స్త్రీ! Utter nonsense!

The Logical Indian: వాళ్ళంతా వివిధ స్థాయిల్లో రక్షించబట్టే ఇక్కడున్నావు నువ్వు. రక్షణ బాధ్యత మగవారి మీద వేసి చెప్పిన సంగతి అది. అంత నాడు లేదు, ఇంత నాడు లేదు, సంత నాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుంది బడాయి.

Facebook Aunty: 🤐🤐🤐

Logical Indian final సామెత:

 తాడి చెట్టెక్కు వాడు గోచీ సరిగ్గా ఉందో లేదో చూచుకోవలెను.
ఫేస్బుక్‌లో వాకృచ్చు వారు Home work చేసుకుని రావలయును.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన