బొంగులో చికెన్‌

 

కామన్‌ ఫ్రెండు బర్త్ డే అనుకో. అందరూ విషెస్‌ చెప్పిందాక ఓ రోజు ఆగి, అప్పుడు బిలేటెడ్‌ విషెస్‌ చెప్పాలి. 


మీకు నచ్చిన పాట ఏంటి మేష్టారు అని ఎవరైనా అడిగితే ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చే ఏడుపుగొట్టు పాట నాకు చాలా ఇష్టం అని చెప్పాలి.

ఉదయం గుళ్ళో కచేరీ చేసి, సాయంత్రం సభలో ఎర్ర కండువా కప్పుకుని కూచోవాలి. ఓటు మాత్రం పసుపు జెండాకి వెయ్యాలి. 

ఇంకా, రాముడి కన్నా రావణాసురుడు మంచోడని ప్రకటించాలి.

అందానికి, ఆచారానికి, గుణానికి ఏ విలువా లేదని, అనాచారాలు,దుర్గుణాలు గొప్పవని వ్యాసాలు రాయాలి.

గుళ్ళో కనిపిస్తే మాయావిడ బలవంతం మీద వచ్చానని చెప్పాలి.

దేవుడు లేడు కానీ దెయ్యం ఉందని చెప్పాలి.

మధ్య మధ్యలో సర్దాకి కా.కు కన్నా హలం గొప్పోడని, హలం కన్నా హెలెన్‌ గొప్పదని ఫేస్బుక్‌ లో పోస్టులు అలా అలా పూర్తిగా అటూఇటూ కాకుండా రాయాలి.

ఇవన్నీ ఎందుకు చెయ్యాలి గురూ గారు?

అందర్లాగే ఉంటే మన స్పెషాల్టీ ఏముంటాదిరా బొంగులోది!

కామెంట్‌లు

  1. నా( FB) మిత్రుడు నరేష్ నున్నా అనే ఓ (ఆడోళ్ళ) పిచ్చివాడిని follow అవుతున్నారేమో అని నాకు చాలా అనుమానం గా ఉంది😀, ఆలాటోల్లు ముఖ పుస్తకం లోనూ, నిజ జీవితం లోనూ చాలా మందే ఉన్నారు అనుకోండి attention కోసం పాకులాడే వాళ్ళు🙄.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

హలో,కార్సికా!

పోస్ట్‌! పోస్ట్‌!

ఏవిుటండీ మీరు మాట్లాడేది??