కట్టర్‌ సాంబార్‌


 వంట చేద్దామని బ్రహ్మీ సిద్ధమౌతుండగా, తలుపు ఎవరో కొడుతున్నట్టు చప్పుడు వినబడింది. తలుపు తీసాడు.


Mr. మిరియమ్‌: మా దేముడు real దేముడన్మాట. మీ present దేముళ్ళు, మా past దేముళ్ళు దేముళ్ళు కాదన్మాట. నేను పైక్ వెళ్ళ్ మొత్తం  చూసొచ్చానన్మాట. నేను direct గా దేముడితో daily phone contact లో ఉంటానన్మాట. మీరు మా మతంలోకి వచ్ఛి మా దేముడ్ని నమ్‌కుని నాకు మీ శాలరీలో ఎవ్రీ మంత్‌ 10% ఇవ్వాలన్మాట. అంతా ఈ బుక్‌ లో ఉన్నాది. చద్వుకోండి. 

ఈ బంపర్‌ ఆఫర్‌కి తల్లకిందులై పోయిన బ్రహ్మీ, ఏమిటో అంతా కన్ఫూజన్‌గా ఉంది సార్‌! లోపలికెళ్ళి మంచినీళ్ళు తాగొస్తా అని తలుపేసుకున్నాడు, కాసేపు చూసి చూసి వాడే పోతాడులే అనుకుంటూ.

ఇంతలో మళ్ళీ తలుపు కొడుతున్నట్టు టకటకా చప్పుడైంది. బ్రహ్మీకి తలుపు తీయక తప్పలేదు.

Mr. రెడ్‌ కారెట్‌:  మీరు అగ్రవర్ణం అయితే మీరు default bad.
మీరు ఫలానా ఇలాకా వారైతే మీరు default bad. మీది ఫలానా జిల్లా అయితే మీరు default bad.మీరు మగవారైతే మీరు default bad. మీరు ఆకలి కేకల మీద కాక పువ్వుల మీద, నవ్వుల మీద కవిత్వం రాస్తే మీరు default bad. మీరు ధనికులైతే మీరు default bad. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి ఈ బుక్‌లో. ఇది బర్మనీలో రాసింది. చదువుకుని కళ్ళు తెరవండి. 

అంతా విన్న బ్రహ్మీకి ఏడుపొచ్చింది. సార్‌! నాది ఆ వర్ణమే, ఆ ప్రాంతమే, ఆ జిల్లానే, ఆస్తిపరుడ్నే. ఖర్మ కాలి నేను మగవాడిని కూడా సార్‌! అన్నాడు తల బాదుకుని ఏడుస్తూ. సార్‌, ఒక్కసారి లోపలికెళ్ళి కళ్ళు,ముక్కు తుడుచుకుని వస్తా సార్‌! అప్పుడొచ్చి చదూతా మీ బుక్కు అన్నాడు రెడ్‌ కళ్ళతో, రెడ్‌ మొహంతో, రెడ్‌ రెడ్‌గా చూస్తున్న రెడ్‌ కారెట్‌ వంక చూస్తూ. అంటూనే లోపలికి పరిగెత్తి ధభీమని తలుపేసుకున్నాడు.

మళ్ళీ తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. మళ్ళీ ఎవరోననుకుంటూ తలుపు తీసాడు.

Mr.గ్రీన్‌ బఠాణీ‌: మేము గ్రీన్‌ బఠాణీస్‌. మీరు temples లో ఎలిఫెంట్స్ ని పెట్టుకోకూడ్దు. దీపావళి ఎయిర్‌ పొల్యూషన్‌. మీరు చేస్కోకూడ్దు. హోలీ పండ్గ వాటర్‌ పొల్యూషన్‌, చేస్కో కూడ్దు. డాగ్స్ కరిస్తే కర్పించుకోవాలి. ఛంపకూడ్దు. బలులు uncivilised. Stop ఛెయ్యాలి. మేం stars తో ఛాలా events ఛేస్తాం. మీర్కూడా రావొచ్ఛు. Participants కి 100 buses పెట్టాం. మటన్‌,చికెన్‌ free. మా ideology అంతా మా బుక్‌ లో publish ఛేసాం. చద్వకపోతే మీ మొహం అంతా పొల్యూషన్‌ అవ్‌తాది. 

ఇన్ని కొత్త కొత్త inputs ఒకేసారి brain మీద దాడి చేస్తే తట్టుకోవడం మాలాంటి వాళ్ళకి కష్టం సార్‌! గొంతు పట్టుకుపోయింది. ఒకసారి ఇంటోకి పోయి మంచి నీళ్ళు తాగొస్తా అని మెల్లిగా ఇంటోకి జారుకుని తలుపేసుకున్నాడు బ్రహ్మీ.

తరువాత మిరియమ్‌, రెడ్‌ కారెట్‌, గ్రీన్‌ బఠా‌ణీ ఎంత తలుపులు బాదినా తలుపు తీయలేదు బ్రహ్మీ. తలుపులు బాది బాది ఇక లాభం లేదని, బ్రహ్మీ ఏం చేస్తున్నాడా అని ముగ్గురూ కిటికీలోంచి తొంగి చూస్తే, పొయ్యి మీద సాంబారు ఉడుకుతోంటే బ్రహ్మీ కూరగాయలు తరుగుతూ సాంబార్‌లోకి మిరియాల్ని గుండ కొట్టి వెయ్యాలి, రెడ్‌ కారెట్‌ ని సన్నగా ముక్కలుగా కోసుకోవాలి,గ్రీన్‌ బఠాణీలని వలుచుకోవాలి అనుకుంటున్నాడు పైకే.

 ఈ మాటలు వింటూనే మిరియం,కారెట్‌,బఠాణీలు అక్కణ్ణించి పారిపోతూ, పోతూ పోతూ బయట నేమ్‌ ప్లేట్‌ మీద, 
కట్టర్‌ హిందూ బ్రహ్మీ , ఛీఫ్‌ చెఫ్‌, భారత్‌ హోటెల్స్ అని చూసి లగెత్తండిరేయ్‌ రాంగ్‌ ప్లేస్‌ కొచ్చాం అని ఇంకాస్త వేగం పెంచి పరుగో పరుగు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన