ఊరురాఊరురారా!

 ఇంటర్యూ చేసే చలాకీ పిల్ల మైకిని: 


మీ లస్కోరా లస్కోరా పాటకు అంతర్జాతీయ బహుమతి రావడంపై మీ స్పందన? 

సినీపాటల రచయిత చండ్ర హింసా రావు: 
నా లస్కోరా పాట భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. “లస్కోరా” అన్న అచ్చ తెలుగు పదాన్ని నేను ఎంతో పరిశోధించి కనుక్కున్నా.

నా పాటలో “జొన్నరొట్టె లస్కోరా“ అన్నది రాయలసీమను, “ముద్దపప్పు లస్కోరా“ అన్నది కృష్ణా ప్రాంతాన్ని, “పూతరేకు లస్కోరా“ అన్నది గోదావరి జిల్లాలని, “మొలకొలుకుల లస్కోరా“ అన్నది నెల్లూరు ప్రాంతాన్ని, “చక్కినాల లస్కోరా“ అన్నది తెలంగాణని, ఈవిధంగా అన్ని తెలుగు ప్రాంతాలను చాలా పకడుగా కవర్‌ చేస్తూ వ్రాయడం జరిగింది. ఇంతవరకూ ఇలా ఏ సినీరచయితా చెయ్యలేదు. 

తరువాత నా, 

మెక్‌డోనాల్డ్స్ 
మోహినివా!
డల్లాస్‌ మెచ్చిన 
దమయంతివా!

 అన్న పాట కూడా సూపర్‌ బంపర్‌ హిట్‌ అయింది. ఆ పాట రాయడానికి నాకు ఏడు సంవత్సరాలు పట్టింది.

మైకిని: మీరు కథ రాసిన సినిమాకు అంతర్జాతీయ బహుమతి వచ్చింది కదా. దాని గురించి చెప్పండి.

సినీ కథారచయిత ఏంద్రేంద్ర రావు:
 ఏ సినిమానించి ఏ ముక్క తీసుకుని,వాడుకోవాలో తెలుసుకోవడం ఓ కళ. అదే నా విజయరహస్యం. అసలు దేన్ని కాపీ కొట్టాలో,ఆ కాపీ కొట్టిన దాన్ని ఎక్కడెక్కడ మనకు కావాల్సినట్టు మార్చుకోవాలో తెలియడమే తెలివి. 

మా “దోమ” సినిమాకు ఫ్రెంచి మూవీ ఇన్పిరేషను. మా “వీరమల్లుడు” సినిమాకు అనేక హాలీవుడ్‌,బాలీవుడ్‌ సినిమాలు కాంట్రిబ్యూట్‌ చేసాయి. నేనైతే ఒక తెలుగు సినిమాని తీసుకుని అందులో కథలో అమ్మాయిని, అబ్బాయిగాను, అమ్మాయిని, అబ్బాయిగాను మార్చి సేమ్‌ స్టోరీ తీస్తే ఎవ్వరు గుర్తుపట్టలేదు. పెద్ద హిట్టయ్యింది. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఫామిలీ సీక్రెట్స్. 

మైకిని:  ఇంగ్లీషులోంచి ఎన్నో చిత్రాలను మీరు తెలుగులోకి డబ్‌ చేసి విజయవంతంగా ప్రదర్శించారు. వాటిలో  “రాకాసి కోనలో దెయ్యాల దిబ్బ”, “వయ్యారి భామ-వంద పిశాచాలు” లాంటివి బహుళ ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు “గర్ల్ & గన్‌” అనే విజయవంతమైన ఆంగ్ల చిత్రాన్ని తెలుగులో “తుపాకీతో లపాకీ” అనే టైటిల్‌ తో డబ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ టైటిల్‌ పెట్టడానికి కారణం ఏమిటి సార్‌?

డబ్బింగ్‌ రాజు: జనాలను ఎట్రాక్టు చేసేదాన్కి మంచి టైటిల్‌ పెట్టినాం. ఎంద్కు పెట్టినారని కొచ్చెన్లెందుకమ్మా. విని ఊరుకోవాల. 

మైకినికి వెంటనే మన కమలాసను చెప్పుళ్ళా, ఈ ఫేమస్‌ డైలాగు గుర్తొచ్చి, భలే నవ్వొచ్చింది-




( ఇంకా ఉంది)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి