Don’t trouble the trouble!

 “అక్కు పక్షి” పత్రికా కార్యాలయంలోకి హడావిడిగా ప్రవేశించాడు అమర సింహారెడ్డి. 


నేరుగా పత్రికకి కార్టూనిస్టు, చిత్రకారుడు అయిన రబ్బర్‌ వద్దకు వెళ్ళాడు. 

ఏయ్‌! రబ్బర్‌! నీ ఆఫీసుకొచ్చా! నీ డెస్కు దగ్గరికొచ్చా! ఏమిటి నీ బొమ్మల కత? 

అది విని పెన్సిల్‌ తో దీక్షగా బొమ్మ వేస్తున్న రబ్బర్‌ తల పైకెత్తి చూసాడు.

అ.సిం.రె: మొన్న మీ పత్రికలో “దీపావళి శుభాకాంక్షలు” అంటూ వేసిన బొమ్మలో కృష్ణుడిని- నడ్డితో అడ్డదిడ్డంగా వంకర్లు తిరిగిపోతున్న చిన్న పిల్లాడు, బోసి మెడతో తింగరిబుచ్చిలా ఉన్న ఓ ఆడ మనిషి బాణం వదలుతుంటే తప్పట్లు కొడుతున్నట్టు అసహ్యంగా వేసి శుభాకాంక్షలన్నావు. అసలు సత్యభామ బాణం వదులుతుంటే కృష్ణుడు చూసే కొంటె చూపు, ఆ మనోహర రూపం, నీ బొమ్మలో ఎక్కడివిరా వెధవా?

రబ్బర్‌: నేనో అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడిని. అది క్రియేటివ్‌ లిబర్టీ.

అ.సిం.రె: బోసి మెడతో ఏ అలంకారాలు లేకుండా చేతిలో ఓ అరేబియన్‌ వాయిద్యం పెట్టి సరస్వతి అని బొమ్మ వేస్తావా? సరస్వతి ఎలా ఉంటుందో తెలియదురా నీకు?

రబ్బర్‌: నేనో అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడిని. అది క్రియేటివ్‌ లిబర్టీ.

అ.సిం.రె: నీ బొమ్మల్లో బొమ్మలకి కట్టు,బొట్టు, కాటుక, గజ్జెలు, తెలుగు సంప్రదాయ నగలు లేకుండా తెలుగు ఆడపడుచుల్ని కిరస్తానులుగాను, విదేశీయులుగాను చిత్రిస్తావే? ఊ! సమాధానం చెప్పు? 

రబ్బర్‌: నేనో అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడిని. అది క్రియేటివ్‌ లిబర్టీ.

అ.సిం.రె: ఏదో పిల్లల పుస్తకానికి నువ్వు వేసిన బొమ్మ చూసా. వాళ్ళు పిల్లలుట్రా? ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడానికి వెళుతున్న పిల్ల దెయ్యాల్లా ఎంత కృూరంగా ఉన్నారో? ఆ పిల్లల మొహాల్లో అమాయకత్వం ఎక్కడైనా ఉందా? ఏమిరా? నోరు పెగల్దే? 

రబ్బర్‌: నేనో అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడిని. అది క్రియేటివ్‌ లిబర్టీ.

అ.సిం.రె: ఇందాకట్నించీ చూస్తున్నా. అన్నింటికీ ఒకటే సమాధానం చెబుతున్నావ్‌. తల పొగరా? తాట తీస్తా.

రబ్బర్‌: ఓకే. అసలు విషయం చెప్పేస్తా. హైందవుల సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు అరచెంచా గౌరవం లేదు. 

అ.సిం.రె: అలా చెప్పు గాడిదా! ఖబడ్దార్‌! 
           
           Don’t trouble the trouble!
           If you trouble the trouble, trouble troubles you! 
           Iam not the trouble! 
           Iam the truth! 


అని అరిచేటప్పటికి రబ్బర్‌ తో సహా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు 
ఉలిక్కి పడితే, ఆ రోజుకి అక్కు పక్షి పత్రికతో సహా అన్ని తెలుగు పత్రికలు, తెలుగు ఛానళ్ళలో అదే పెద్ద న్యూస్‌.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన