సదాచార సంపన్నుడు

 

1. 52 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళ వాడిలాగా ప్రవర్తించేవాడిని

2. వయసు దాచిపెట్టాలని నిరంతరం ప్రయాస పడేవాడిని
3. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో పడి ఉండేవాడిని
4. డబ్బు లేక పేరు తెచ్చి పెట్టే పనులు మాత్రమే చేసేవాడిని
5. పైకి దేశీలా కనిపిస్తూ విదేశీలా ఆలోచించే వాడిని
6. ఏదో లాభం ఆశించి స్నేహాలు చేసేవాడిని
7. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే వాడిని
8. మేడిపండులాంటి వాడిని

పై వాటిల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా ఏమనవచ్చురా వాడిని?

“ఆధునికుడు” అనవచ్చునండీ.

బాగా చెప్పావు. మరి వాటిల్లో ఒకటికంటే ఎక్కువ లక్షణాలు ఉంటే?

“తాతాచారి శిష్యుడు” అనవచ్చునండీ.

శెభాష్‌! మరి అన్ని లక్షణాలు ఉంటే?

మూడు రకాలుగా చెప్పొచ్చండీ.

“వామ పక్షి”,”లిబరల్‌”,”తాతాచారి” 

హహ, భలే! బాగా పోల్చుకున్నావు.

మరి పై లక్షణాలలో ఒక్కటీ లేనివాడు?

“సదాచార సంపన్నుడు”

ఆగాగు, ఈ ఒక్కమాటకీ నీ కాళ్ళ మీద పడాలనుందిరా! 
నీ నోట్లో పంచదార పొయ్యా! 
 
ఆయుష్మాన్‌ భవ! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి