రామాయణంలో తాతాయణం
తాతాచారి రామాయణం మీద అవాకులు చెవాకులు వ్రాసాడని తెలుసుకుని, నొచ్చుకున్న వాల్మీకి, పైలోకాల నుండి స్వయంగా దిగి వచ్చి తాతాచారి ఎదుట నిలబడి, నా రామాయణం గురించి ఏమిటి నీ వేషాలు? అని ప్రశ్నించాడు.
తాతాచారి: రాముడు శంబుకుడిని వధించడం కుల వివక్ష వల్ల.
వాల్మీకి: నేను వ్రాసిన రామాయణంలో ఆ వృత్తాంతమే లేదయ్యా. తరువాతి కాలంలో అతి తెలివిగాడెవడో కలిపాడు.
ఒక్కసారి ఆలోచించు. నేనొక బోయవాడిని. నేను తపస్సు చేసి మహర్షిగా గౌరవం పొందలేదు? దేశానికి మహారాణి అయిన సీత నా ఆశ్రమంలో నివసించలేదూ?
తాతాచారి: రాముడు ఆర్యుడు. రావణుడు ద్రావిడుడు.
వాల్మీకి: ఆర్య ద్రావిడ విభేదాలు మాకాలంలో లేవు. రావణుడు బ్రాహ్మణుడు. ద్రావిడుడు ఎలా అయ్యాడు? మా కాలంలో ఉన్నది ధర్మము, అధర్మము మాత్రమే.
తాతాచారి: కల్ప వృక్షము వట్టి ఛాందసం. విష వృక్షము విప్లవం.
వాల్మీకి: కల్ప వృక్షము నాకు, రామునికీ ఇష్టము. విషవృక్షము ధర్మగ్లాని.
తాతాచారి: అనేక రామాయణాలున్నట్టే, అనేక వాల్మీకులున్నారు. నువ్వెవరివో?
వాల్మీకి కోపం పట్టలేక, మూల రామాయణకర్తనైన నన్ను అవమానించడమే కాక, నేను కాక ఇంకా అనేక వాల్మీకులున్నారని కట్టుకథలు సృష్టిస్తావా?
యుగాలుగా భరతవర్షంలోని ప్రజలు రామాయణాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని తమ జీవితాలను దిద్దుకుంటుంటే, నువ్వు దాని స్థాయి తగ్గించివేసే కాకమ్మ వ్యాసాలు రాస్తావా? తెలుగు ఆచార్య పదవిలో ఉండి సిగ్గు లేదూ? దీనివల్ల నీకు వచ్చిన ప్రయోజనమేమిటి?
నీకన్నా చదువు రాని పల్లెవాసులైన రామభక్తులు లక్ష రెట్లు నయం. దద్దమ్మా! అంటూ తన పూర్వపు బోయవాని వేషంలోకి మారడము, అప్పటికే పిక్కబలం చూపిస్తున్న తాతాచారి పృష్ఠభాగము మీదకు తన బాణాన్ని జుయ్యిమని వదలడము తృటిలో జరిగిపోయినవి.
రామాయణంలో తాతాయణము అన్న కాండలో మొదటి భాగము సమాప్తము.
స్వస్తి.