ఈశ్వరుడైనా పట్టలేని ఇంటి దొంగలు

 


కవి: నాకు “వారణాసి పండిత” అని బిరుదు.

వృద్ధ వేద పండితుడు: ఎల్లా వచ్చిందండీ?

కవి: కాశీ విశ్వేశ్వరుడికి సుప్రభాతం రాసా. నాదే ఏకైక సుప్రభాతం. 

వృద్ధ వేద పండితుడు:మహా శ్మశాన సంచారి అయిన మహాకాలుడు నిద్ర పోవడమేమిటి, ఆయన్ను నువ్వు నిద్ర లేపడమేమిటయ్యా నీ బొంద.

కవి: నాకు “బక్రీ కవి” అని బిరుదు. 

వృద్ధ వేద పండితుడు: ఎల్లా వచ్చిందండీ?

కవి: బక్రీ బాబా సహస్ర నామాలు, బక్రీబాబా గాయత్రీమంత్రం రచించా. 

వృద్ధ వేద పండితుడు:హిందూ దేవీదేవతల సహస్ర నామాలు, మంత్రాలు బక్రీ బాబాకి అంటగట్టమేమిటిరా నెల తక్కువ వెధవా. 

కవి: నాకు “కాళీ కవి” అని బిరుదు. 

ఎల్లా వచ్చిందండీ?

కవి: కాళీ మాతకు జోల పాటలు రాసా.

వృద్ధ వేద పండితుడు:మహా ఉగ్రరూపిణిగా, శక్తిస్వరూపిణిగా పూజించవలసిన తల్లికి నువ్వు జోల పాటలు రాయడమేమిటిరా నీ పిండాకూడు. 

కవి: నాకు “దేశీవిదేశీ కవి” అని పేరు. 

వృద్ధ వేద పండితుడు: ఎల్లా వచ్చిందండీ?

కవి: నేను దేశీయుడినే కానీ విదేశీమతం పుచ్చుకున్నా. ఆ విదేశీమతాన్ని దేశీ మార్గంలో ప్రచారం చేస్తే తొందరగా జనాల్లోకి వెళుతుందని నా దేశీ తెలివితేటలు ఉపయోగించి మా విదేశీ దేవుడి మీద స్తోత్రాలు, మంత్రాలు,సహస్ర నామాలు ఎన్నో రచించా. 

వృద్ధ వేద పండితుడు: ఓరి ధర్మ భ్రష్ట అనుకరణ అప్రాచ్య గాడిదా ! 


మీలాంటి త్రాష్టులతో మాట్లాడి నా సమయం వృధా అయిపోయింది. నా సంధ్యావందనానికి సమయం అవుతోంది. తరువాత వేద పాఠశాలకు వెళ్ళాలి. బొందిలో ప్రాణమున్నంత వరకూ నా ధర్మాన్ని నేను రక్షించుకుంటా అనుకుంటూ అక్కడినించి వెళ్ళిపోయాడా వయోవృద్ధుడు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన