నేటి భారతంలో ఆనాటి యోగి యాత్ర
రెండు వందల యేళ్ళుగా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ, తన దేశము, దేవాలయాలు గుర్తుకు రాగా ఒక్కసారి చూసిపోదామని దేశంలోకి వచ్చాడు ఒక యోగి.
ప్రజల వేషభాషల్లో వచ్చిన మార్పులను చూసి ఆశ్చర్యపోయి, దారిన పోయే దానయ్యను ఆపి, ఏమయ్యా, ఆ స్త్రీలంతా బొట్టు లేకుండా, ఇతర హైందవ మంగళ చిహ్నాలు లేకుండా ఉన్నారేమిటి? అని అడిగాడు ఆశ్చర్యంగా.
దానయ్య: వాళ్ళంతా ఇలవేల్పులను వదిలి విదేశీ దేవుడిని నమ్ముతున్న మాజీ హిందువులయ్యా.
యోగి: ఆ! అలాగా! మరి అటువైపుగా జుట్లు విరబోసుకున్న బొట్లు లేని స్త్రీలు, పొగ పీలుస్తూ ఉన్న పురుషులు? వాళ్ళూ స్వధర్మాన్ని విడిచిపెట్టిన వారేనా?
దానయ్య: వాళ్ళంతా ఆధునిక హిందువులయ్యా. వాళ్ళకి హిందూ ధర్మం అంటే హేళన,నిర్లక్ష్యం.
యోగి: ఆ! అలాగా! మరి ఆ ఎర్ర జెండాలు పట్టుకు పోతున్న వారెవరయ్యా? వారు హిందువులేనా?
దానయ్య: వాళ్ళంతా హిందువుల పేర్లతో ఉండి హైందవాన్ని ద్వేషించే నాస్తిక హిండూస్.
యోగి: ఆ!అలాగా! అదిగదిగో చక్కగా హిందూ వేషాల్లో ఉన్నారే వారంతా గుంపులుగా ఎటుపోతున్నారో?
దానయ్య: వాళ్ళంతా హిందువులే. బాబాల భక్తులు.
యోగి: ఆ! అలాగా! ఎందుకు అల్లా చేస్తున్నారో?
దానయ్య: మహిమలు చూపించి కొల్లలుగా పుట్టుకొచ్చే తమ కోరికన్నీ తీరుస్తారని, తమ కులదైవం కన్నా, తమ పెద్దలు పూజించిన ఇలవేల్పుల కన్నా, ఈ బాబాలే మహిమ గల వారని వీరి విశ్వాసమయ్యా.
యోగి: ఆ!అలాగా! మన మహర్షుల కన్నా, సిద్ధుల కన్నా గొప్పవారా వీరు? ఏలాటి మహిమలు చూపుతారో?
దానయ్య: చెబుతా విను.
డిప్ప బాబా: ఈ బాబా మన డిప్ప మీద ఒక్కసారి కొడితే చాలు, మన కోరికలు తీరుతాయని హిందువుల నమ్మకం. డిప్ప బాబా పోయాక సమాధి కట్టి పూజిస్తున్నారు.
బూతుల బాబా: ఈ బాబా ఎవర్ని బండ బూతులు తిడితే వారికి కలిసి వస్తుందని నమ్మకం. బాబా దగ్గరకు వచ్చి ఎప్పుడు మమ్మల్ని బూతులతో ఆశీర్వదిస్తాడా అని జనాలు ఎదురు చూస్తూ ఉంటారు.
ప్రముఖ వ్యాపారి కుబేర రావును, ఈ బాబా “పోరా, ల@&@ కొడకా!”
అని తిట్టిన తరువాతే ఆయనకు వ్యాపారంలో కలిసి వచ్చి కోటీశ్వరుడైనాడని జనం చెప్పుకుంటుంటారు.
రాళ్ళ బాబా: ఈ బాబా రాయి తీసుకుని ఎవరిని కొడితే వాళ్ళ కోరికలు తీరుతాయని నమ్మకం. బాబా చేత రాయితో కొట్టించుకోవడానికి ఎవరి రాయి వారే తెచ్చుకుని బాబా చేతిలో పెట్టడానికి పోటీ పడుతుంటారు.
ఇలా ఎంతోమంది బాబాలు.
యోగి: బాబా అంటే మరి బాబా గారి మతం వాళ్ళు కూడా బాబా భక్తులేనా?
దానయ్య: హహ్హహ్హ! బాబా గారి మతం వారు రారయ్యా.మన హిందువులే వెళతారు. వెళ్ళి కోట్లు కోట్లు హుండీల్లో సమర్పించుకుంటారు.
యోగి: ఆ!అలాగా! అయ్యో! ఏమిటీ వైపరీత్యం?
మన పుణ్యక్షేత్రాలను,దేవీ దేవతలను,రామాయణ భాగవత గ్రంథాలను వదిలేసారా నా దేశ ప్రజలు! అని వగచి,
అమ్మా! శ్రీశైల భ్రమరాంబ! వీరిని ఈ మాయలోంచి బయట పడెయ్యి తల్లీ! హిందువును హైందవ భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపు నడిపించమ్మా! అని ప్రార్థించి, దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలలోనూ సాధన చేసుకుని తిరిగి హిమాలయాల వైపుకి ఆకాశ మార్గాన సాగిపోయాడా యోగి.