మసాలాతో పిచ్చెక్కిస్తా!
దర్శకుడు ధూర్తా రావు, నిర్మాత అత్యాశా రావు, పాటల రచయిత మడత కాజా కొత్త సినిమా పాటల రాత కోసం బైఠక్‌లో కూచుని ఉన్నారు.
పాటల రచయిత మడత కాజా:
నీ అధరమొక
చిత్తు కాగితం
నా ముద్దు ఒక
పిచ్చి సంతకం
దర్శకుడు ధూర్తా రావు:
సూపర్! ఇంకా మసాలా పడుద్ది. పిచ్చెక్కించెయ్!
మడత కాజా:
కుట్టిందా
దోమా దోమా
కరిచిందా
చీమా చీమా
నువ్వే నా
వాస్కోడిగామా
నిర్మాత అత్యాశా రావు: సూపరెహే! పిచ్చెక్కించెయ్!
మడత:
నువ్వే నా
రోటీమాటిక్
నేనే నీ
బజాజ్ చేతక్
నువ్వే నా
బీడీ చుట్టా
నేనే నీ
చీపురు కట్టా
రావే నా
గుంతలక్కిడీ
రారా నా
ముంత మామిడీ
ధూర్తా: ఇంకా మసాలా వెయ్! పిచ్చెక్కించెయ్!
మడత: పుయ్యావ్
జుయ్యావ్
డుయ్యావ్
కమ్మాన్
కమ్మాన్
కమీనే!
జపానే
బనీనే
పుల్కానే!
అత్యాశా: మసాలా వెయ్! పిచ్చెక్కించెయ్!
ధూర్తా: మసాలా వెయ్! పిచ్చెక్కించెయ్!
పిచ్చెక్కించెయ్!
పిచ్చెక్కించెయ్!
పిచ్చెక్కించెయ్!
అంతలో ఆకాశ మార్గాన హైదరాబాద్ మీదుగా వెళుతున్న తథాస్తు దేవతలు సరిగ్గా అదే సమయానికి “అలాగే,తథాస్తు!” అనడంతో నిర్మాత అత్యాశా రావు, దర్శకుడు ధూర్తా రావు లకు పిచ్చి పట్టి హైదరాబాద్ వీథుల్లో పరిగెడుతూ, దోవలో మూసీ నదిలో ఢామ్మని పడి, జలకాలాటలలో పుల్కా పాటలలో ఏమి జాయిలే హలా! అని పాడుకుంటూ ఆ మురికి నీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకుంటూ పిచ్చి పిచ్చిగా కేరింతలు కొట్టసాగారు.