మాటల్తో కొట్టి కొట్టి చంపకే!
యాంకరమ్మ1:
ఐదడుగుల అందగాడు,
చింతాకు కళ్ళవాడు,
మన ఊర మాస్ మారాజా,
ధనాధన్ ధన్ రాజ్ గారిని
స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము!
లేడీస్ అండ్ జంటిల్మెన్, పుట్ యువర్ హాండ్స్ టుగెదర్ ఫర్ యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జిటిక్ హీరో ధన్‌ధనా ధన్!!
చెప్పండి సర్, ధన్ గారు, సెవెన్టీస్ లో ట్వన్టీస్ గా ఎలా మైన్‌టైన్ చేస్తున్నారు?
ఈ మూవీలో హీరోయిన్‌తో మీ కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అయింది?
మీరు హెయిర్ వీవింగ్ కోసం ఈమధ్య ఇటలీ వెళ్ళారని ఇండస్ట్రీలో టాక్.
దాని గురించి మా ఆడియన్స్ తో డీటైల్స్ షేర్ చేసుకుంటారా సర్..
యాంకరమ్మ2(కమ్ సింగరమ్మ):
ఈ ఛల్లని ఈవ్‌నింగ్ మనమంతా ఇక్కడ మంఛి మంఛి కబుర్లు ఛెప్పుకోడానికి గాదెర్ అవడం నా ఛాలా ఛాలా హాప్పీగా ఉంది. మీకోసం మంఛి సంగీతం,పాట్లు అందించబోతున్నాం, హాప్పీగా ఎంజాయ్ చేసేద్దామా మరి?
సంగీతం ఆపాత మధురం!
మరి సాహిత్యం?
హహ, మీరే ఛెప్ఫాలి.
ఇప్పట్నించీ ఇంకో ఫయివ్ అవర్స్ మన్మంతా సంగీతంలో, అంఠే, సంగీతం ఒక ఓషిన్‌లాంటిదనుకోండి, మీకు తెలియనిదేముంది?
హహ, ముందుగా నాకిష్ఠమైన పాఠతోనే స్టార్ట్ ఛేస్తాను. హిహి..
ఈ వేళలో నీవు
భోం ఛేస్తు ఉంఠావో
మందేస్తు ఉంఠావో
అనుకుంఠు ఉంఠాను
ప్రతి నిమిషమూ నేను…
వాఠె వండర్‌ఫుల్ ఫీలింగ్! వావ్!
ఈ పాఠ ఇన్నేళ్ళైనా నాకు గూస్‌బంప్స్ త్తెప్ఫిస్తుంది!
వావ్! వావ్! వాఠె ఫీలింగ్! లవ్లీ!
యాంకరమ్మ3:
హల్లో అమ్లాపురం!
ఎలా ఉన్నారు అమ్లాపురం మాస్?
ఒక “ఓయ్” వేస్కుందామా?
అసలు అమ్లాపురం అంటేనే ఊర మాస్!
ఓయ్!
ఈ ఈవ్నింగ్ మాంఛి ఊపు డూపు ఖైపు ఉన్న జబ్బర్దస్త్ మాస్ మాస్ సాంగ్స్ ఫాఢి మీతో డాన్స్ చేయించబోతున్నాం!
మరి అమ్లాపురం రెడీనా?
ఒక్కసారి గట్ఠిగా ఓయ్ వేస్కోండి!
విన్పించట్లా.
ఇంకోసారి.
ఇంతేనా అమ్లాపురం యూత్ జోష్?
ఇంకోసారి ఘట్టిగా ఓయ్! ఓయ్! ఓయ్!