The డ్రామాయణ్‌

 


డైరెక్టరు కొత్త సినిమా కోసం కథ వినిపిస్తున్నాడు నిర్మాతకు.

“The డ్రామాయణ్‌” ! ఇదీ మన సినిమా పేరు. రామాయణాన్ని modern outlook తో చూపిస్తాం. 


First scene- దశరథ్‌, ఆయన భార్యలు సంతానం లేక అనేక సంతాన సాఫల్య ఉపాయాలు చేసి ఫలించక పుత్రకామేష్టి యాగం చెయ్యగా అందులోంచి యజ్ఞ పురుషుడు బయటికి వచ్చి (ఇక్కడ graphics) ఒక గిన్నెనిండా బిర్యానీ ఇచ్చి మీ రాణులకు పంచమంటాడు. 

నిర్మాత: పాయసమో ఏదో అనుకుంటాగా. బిర్యానీ అంటావేంటీ?

డైరెక్టరు: అది original కథలో. మనం కొత్తదనం కోసం మారుస్తామన్మాట. తర్వాత కట్‌ చేస్తే నలుగురు పిల్లలు పుట్టడం, అక్కడొక పాట, పాట ending లో పెద్దవాళ్ళై పోయిన నలుగురు పిల్లలు అయోధ్యలో రాజ భవనం తోటల్లో గుడ్లగూబల మీద తిరుగుతున్నట్టు చూపిస్తాం. 

నిర్మాత: గుడ్లగూబలా?

డైరెక్టరు: yes, గుడ్లగూబలే! Graphics లో. రాముడి entry మాత్రం అద్దిరిపోద్ది. 


డీజే టిల్లు పేరు 
వీని స్టయిలే వేరు 
సోకేమో హీరో తీరు 
కొట్టేది తీనుమారు 

డీజే టిల్లు కొట్టు కొట్టు
 డీజే టిల్లు కొట్టు 
బేసు జర పెంచి కొట్టు 
బాక్సులు పలిగేటట్టు!


ఆ పాటంది కదా. సేమ్‌ అదే ట్యూన్‌లో-

సీతా సీతారాం రాం!
సీతా సీతారాం రాం!
రాముడి స్టైలే వేరే!
…. 

ఈ టైప్‌లో వస్తాది backdrop లో పాట. 

రాముడి రెండు జబ్బలకి టాటులు, చెవులకి నాలుగేసి రింగులు. అద్దిరిపోద్దంతే.

Next, సీత entry. అక్కడొక jazz song. 

తర్వాత స్వయంవరంలో ఒక disco song. 

Next, forest లో పేద్ద building. 
Building బయట సింహాలు, చిరుత పులులు కట్టేసి ఉంటాయ్‌.

అప్పుడు ఐటం సాంగ్‌తో  శూర్పణఖగా సన్నీ లియోన్‌ entry. 

ముద్దు పెట్టు
ముద్దు పెట్టు
రామా! 

అంటూ బెల్లీ డాన్స్ చేస్తుంది.

 Next ముక్కు చెవులు కట్టింగ్‌. 

Next రావణ్‌ grand entry. 

రావణ్‌ body మొత్తం tattoos. 

వెరైటీ కోసం రెండు రెండు తలల చొప్పున ఐదు వరసల్లో తలలుంటాయ్‌. 

ఒక మెటాలిక్‌ బల్లి మీద ఆ forest building ముందు దిగి సీతను కిడ్నాప్‌ చేస్తాడు. 

Next వానర సేన అంతా motor bikes వేసుకుని సీత కోసం search చేస్తారు. 

నిర్మాత: ఆగాగు. ఏంటో తేడా కొడుతోందయ్యా. జనాలు తిరగబడతారేమో?

డైరెక్టరు: అందుకే ఒక ప్లాన్‌ వేసా. ఇందులో పాత్రలెవ్వరికీ original పేర్లు ఉండవు. రాముడి పేరు రోగు, సీత పేరు జాన్కీ, లక్ష్మణుడి పేరు భాయ్‌, హనుమంతుడి పేరు మంకీ భాయ్‌ ఇలాగన్న మాట. అప్పుడు ఎవ్వడూ మాట్లాడలేడు. 

నిర్మాత: బావుందయ్యా. సూపరో సూపరు. అయితే ఇలాగే ప్రొసీడవుదాం. మరి Budget?
     
డైరెక్టరు: మనదంతా భారీ తారాగణం. భారీ graphics. Budget ఒక వెయ్యి కోట్లు రెడీ చేసుకోండి. 

అంతలో అప్పుడొక విచిత్రం జరిగింది. 

జాంబవంతుడు, అంగదుడు మొదలైన వానర జాతి వీరులంతా ఆ గదిలో ప్రత్యక్షమై, ఏంట్రా వాగుతున్నారు? టుమ్రీ నాయాళ్ళారా! మీ కతను తీస్కెళ్ళి *&@ లో పెట్టుకోండి, డింకీ రాస్కేల్స్! అని నడ్డి మీద తన్నగానే డైరెక్టరు, నిర్మాత అరేబియా సముద్రంలో వెళ్ళి పడ్డారు. 

వాళ్ళు పడింది భారత సముద్రజలాలను దాటి, కిలికీ దేశ జలాల్లో కావడంతో ఆ దేశ సైనికులు ఇద్దరినీ *&@ మీద తంతూ పట్టుకెళ్ళి బంగాళా దుంపంత బంగారం ఇచ్చుకుంటామని బతిమిలాడినా వినకుండా జీలకర్రంత జైల్లో పెట్టారు.

ప్రస్తుతం ఇద్దరూ అక్కడ రామనామ జపంతో కాలక్షేపం చేస్తున్నారని వినికిడి.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన