మాకు మేమే మహారాజులం! -1

 


నేను హీరోలనుకున్న వాళ్ళంతా జీరోలని, 
వాళ్ళని హీరోలనుకున్న నేనొక జీరోనని, 
జీరో పక్కన జీరో పెడితే జీరోయేనని 
తెల్సుకున్నానన్నియ్యా! 

ఇంకనించీ నన్ను నేనే హీరో అనుకోవాలని డిసైడయ్యా నన్నియ్యా! 

శెభాష్‌ తమ్మీ! ప్రొసీడ్‌! నువ్వు సూపరెహే! 

తెలివైన వాడు అన్నింట్లోనూ తెలివైన వాడుగా ఉండలేడని, 
తెలివైన వాడు అన్నింట్లోనూ తెలివైన వాడుగా ఉంటాడనుకోడం 
మన తెలివి తక్కువతనం అని
తెల్సుకున్నానన్నియ్యా! 

ఇంకనించీ నేను నా తెలివినే నమ్ముకుందామని డిసైడయ్యా నన్నియ్యా! 

శెభాష్‌ తమ్మీ! ప్రొసీడ్‌! నువ్వు సూపరెహే! 

ఎక్కువ మాట్టాడే వాడికి తక్కువ ఆలోచనుంటాది, 
తక్కువ మాట్టాడే వాడికి ఎక్కువ ఆలోచనుంటాదని తెల్సుకున్నానన్నియ్యా!

ఇంకనించీ తక్కువ మాట్టాడాలని డిసైడయ్యా నన్నియ్యా! 

శెభాష్‌ తమ్మీ! ప్రొసీడ్‌! నువ్వు సూపరెహే! 

మందు కొట్టే వాడు మందమతని,
తాగుబోతుకి ఆంబోతుకి తేడా లేదని 
తెల్సుకున్నా నన్నియ్యా!

ఇంకనించీ ఇట్టా నీతో కల్సి తాగడం మానెయ్యాలని డిసైడయ్యా నన్నియ్యా! 

శెభాష్‌ తమ్మీ! ప్రొసీడ్‌! నువ్వు సూపరెహే! 

తాంక్స్ అన్నియ్యా!  

ఇట్నించిటు ఇంటికెళ్ళి బాటిల్సన్ని పట్కెల్లి కిష్నా నదిలో పోసొత్తానన్నియ్యా! 

కిష్నాలో ఎంతుకు తమ్మీ? మందంతా ఏస్టై పోతళ్ళా?
 
ఆ బాటిల్సన్నీ మా ఇంటి కాడికి పంపు తమ్మీ, తాగి పెడతా. 

వా! నేనంటే నీకెంత పేమన్నియ్యా! వా!

ఒంటిగా మందు కొట్టేది కష్టం గానీ, రోజూ నువ్వు గూడా వచ్చి కంపెనీకి తాగిపెట్టాల తమ్మీ!

అట్నే అన్నియ్యా! నీకోసం దేనికైనా రెడీ అన్నియ్యా! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి