ఆహా, ఏం చెప్పారు సార్‌! 🥸

 


పాఠకుడు: బండబారి గారు, మీ “ఎండలో తెలుగు పిల్ల” నవలలో కథానాయిక పాత్రను చంపేసారేమీ? 

బండబారి: నేను చాలా ప్రాక్టికల్‌. తెలివైన ఆడపిల్లలు ప్రియురాళ్ళుగా బావుంటారు గానీ భార్యలుగా కాదు. అందుకే ఆ పాత్రను చంపేసా. 

పాఠకుడు: ఆహా, ఏం చెప్పారు సార్‌! 🥸

పాఠకుడు: హలాహలం గారు, మీ మైదానం బ్రాజేశ్వరికి చదువు చెప్పించి మానసిక వికాసాన్ని, తద్వారా స్వేచ్ఛని పొందినట్టు రాయొచ్చుగా?  

హలాహలం: నా లేడీ పాత్రలు ఏవీ మెదడును వాడవు. నాలాగే వ్యామోహాలలో కొట్టుకుపోవడం తప్ప వాటికి వేరే మార్గం లేదు. 

పాఠకుడు: ఆహా, ఏం చెప్పారు సార్‌! 🥸

పాఠకుడు: తిరకాసో గారు, మీ లేడీ పాత్రలు అలా చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తాయేమి? 

తిరకాసో: అలా ప్రవర్తింపజేసి అదే స్వేచ్ఛ అని లేడీస్‌ ని నమ్మింపజేయడమే నేను నమ్మిన డమ్మీనిజం. 

పాఠకుడు: ఆహా, ఏం చెప్పారు సార్‌! 🥸

పాఠకుడు: అరుణశ్రీ గారు, మీ జీవిత చరిత్ర “యుగాంతం” లో  నానా చెత్త మీ వ్యక్తిగత విషయాలన్నీ వ్రాయడం వల్ల ఎవరికి ఉపయోగమండీ? 

అరుణశ్రీ:     ఔను నిజం
                 అదే నిజం!
                 యుగాంతమే
                 నిజం నిజం!
                 చదువు చదువు
                 నిజం నిజం
                యుగాంతమే
                 నిజం నిజం!


పాఠకుడు: 🥸🥸



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి