ఏమో ఏమో ఇది!

 


పురాణాలు చెప్పేవాడు “పౌరాణికుడు” అవుతాడుగానీ
 “ఆధ్యాత్మిక వేత్త” ఎలా అవుతాడండీ? 

ఏమోనండీ. తెలియదు. 

అయినా శాస్త్రవేత్తలాగా “ఆధ్యాత్మిక వేత్త” ఏమిటండీ? 

ఏమోనండీ. తెలియదు. 

అవధానికి, ప్రవచనకారుడికి, గురువుకి తేడా చూసుకోవాలి కదండీ?

ఏమోనండీ. తెలియదు. 

బాబాలు దేవుళ్ళైతే మరి వాళ్ళు పూజించిన దేవుడు మనకేమౌతాడండీ? 

ఏమోనండీ. తెలియదు. 

మనం సాధన చేత గురువు స్థాయికి ఎదగాలి గానీ అది మానేసి అస్తమానం గురువు గారి కాళ్ళు కడుగుతుంటే ఏమి వస్తుందండీ? 

ఏమోనండీ. తెలియదు. 

తరతరాలుగా కొన్ని వేల యేళ్ళుగా మీ పూర్వీకులు పూజించిన మీ కులదేవతలున్నారు కదా, వారిని వదిలేసి ఎవడో చెప్పాడని కొత్త దేవుళ్ళని పట్టుకుని మీ సంప్రదాయం వదిలేయడమేమిటండీ? 

ఏమోనండీ. తెలియదు. 

వదిలేసారు సరే, వాడెవడో చెప్పాడని మీ పూర్వీకుల దేవతలని పని గట్టుకుని ద్వేషించడమేమిటండీ?

ఏమోనండీ. తెలియదు. 


దారిన పోయే దానయ్య: అన్ని మాట్లు అంతమంది తెలీదంటున్నా ప్రశ్నలడుగుతున్నావు చూడు, నీ ఓపికకి మెచ్చుకోవాలయ్యా. మన జనాలు సగంమంది గుడ్డి గమాక్సిన్లని, బుర్ర ఏ కోశానా వాడని గుంపులో గోవిందలని ఇంకా అర్థం కాలేదుటయ్యా?


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి