ఓ అమెరికాంతామణి ఆవేదన

 


అబ్బా, ఎంత బావుందో మీ ఇల్లు!

ఆ, ఏవుందిలెండి. 
మీలాగా నాకు ఉద్యోగమా ఏమన్నానా? 

అదేమిటంటీ?
 మీ వారు రెండు చేతులా సంపాదిస్తుంటేను. 

ఆ, ఏవుందిలెండి.
 మీకుమల్లే నాకో  కెరీర్‌ లేకపోయింది.

ఈ కెరీర్లు అవీ ఏముందిలెండి. 
మీకు బోలెడు నగలు.
 ముత్యాల్లాంటి పిల్లలు. 
చక్కని సంసారం. 
ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? 

ఆ, ఎన్నున్నా ఏముందిలెండి. 
ఉద్యోగం సద్యోగం లేకపోయింది. 

మీ పిల్లలు చక్కగా స్థిరపడ్డారుగా. 
అదే కదండీ కావాల్సింది.

ఆ, ఏవుందిలెండి. 
ఓ ఉద్యోగం చేయలేక పోయాను.

పోనీ, ఇప్పుడు చెయ్యండి ఉద్యోగం.

ఆ, ఇప్పుడు నాకెవడు ఇస్తాడు ఉద్యోగం?
 ఇచ్చినా వెయ్యో రెండు వేలో ఇస్తారు. 
అంత చిన్న జీతానికి ఎవడు పని చేస్తాడు? 
నా వల్ల కాదు.

పోనీ, ఏదైనా వ్యాపారం చెయ్యండి. 

పిల్లలు స్థిర పడ్డారు. 
ఈయన బిజీగా ఉంటారు. 
ఈ వయసులో వ్యాపారమని నేనెక్కడ హైరానా పడను? 

ఇప్పుడు సరిగ్గా మాట్లాడుతున్నారు. 
మీది చీకూచింతా లేని జీవితం. 
ఎంతోమంది ఆడవారికన్నా మీరు ఎన్నో రెట్లు అదృష్టవంతులు. హాయిగా ఉండండి. 

ఆ, ఏవుందిలెండి. 
ఏదో నన్ను ఓదార్చడానికి అల్లా అంటున్నారు మీరు. 
మీరు ఉద్యోగస్థులుగా. ఎన్నైనా చెబుతారు. 
నా బతుకే, ఒక ఉద్యోగం సద్యోగం లేకుండా వృధాగా గడిచిపోయింది.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన