బియ్యం కరువొచ్చిందోలప్పో!

 



ఏందిరా ఆ పరుగులేందంటా? 

అహా, అస్సల్కి కొంచమైనా సిగ్గూ షరమ్‌ ఉన్నాదిరా?
 అరెరెరెరే! ఈ పోరగాల్లు దేశం ఇజ్జత్‌ దీస్తుండ్రు. 

ఒగడి నెత్తి మిన్న ఒకడెక్కుడేంది? 
లోడ్లు లోడ్లు బియ్యం బస్తాలు బండ్లల్లో నింపుడేందివయ్యా?

 నీ ఎన్కాల ఇంకో తెలుగోడున్నడు, వాడికి పెళ్ళాంబిడ్డలున్నరు, ఆడు కూడా బియ్యం తినేటోడు అన్న ఇంగితం ఉండాలి గదవయ్యా?

అయినా తెల్వకడుగుతా, ఈ బియ్యం ఆపిన్రు. గయితే ఏమౌతాదివయ్యా? 

జాస్మిను రైసు, లాంగు రైసు, చైనా రైసు, జపాను రైసు ఇన్నున్నయ్‌ గదవయ్యా? అవి దింటే అయిపాయె. 

ఏం దేశవాళీ బియ్యం దినకుంటే ముద్ద దిగదానే? ఓరి మీ ఏసాలో. 

తూతుతూతు, షాపులల్ల పైపైకెక్కి బస్తాల్లాగుతా ఆగం ఆగం చేస్తుండ్రు. 

తూతుతూతు, సిగ్గుబోయె. పక్క దేశాల్లోల్లు నవ్వరానె? 

మా తాతలకాలం నుండి చూషినం మస్తు కరువులు. 

కరువంటే ఈమాదిరి ఒక్క వస్తువు కరువుగాదు, కరువంటే ఒక్క తిండిగింజ కూడా దొరకని కరువు.
 ఏది దొరికితే అదే తిన్నం. ఏమేమో దిన్నం ఆకులలములు. 

అరెరెరెరే, ఒక్క బియ్యం దొరక్కుంటేనే ఇంత లొల్లి జేస్తుండ్రు? 

గోధుమ రొట్టెలు దినుండ్రి. సజ్జ రొట్టెలు దినుండ్రి. జొన్న రొట్టెలు దినుండ్రి. రాగిముద్ద దినుండ్రి. ఎన్ని లేవయా నాకు దెల్వకడుగుతా? 

చారాణా కోడికి బారాణా మసాలన్నట్టు, ఎందిరా, 
ఒక్క బియ్యం బస్తా యాబై డాలర్లు బెట్టి కొనుడేందిరా?

 దిమాక్‌ ఉందారా?

షాపులతాని ఈ హంగామేందిరా? 

అరెరెరెరే! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన