అటూ ఇటూ అంతా వాదం! వాదం!
ఎర్ర కూజా: నేను లెఫ్టే కానీ నేను చెప్పేదే రైటు.
బాపు గారు బతికినంత కాలం హిందూ దేవీ దేవతల బొమ్మలే వేసారు. జన జీవన స్రవంతికి సంబంధించిన బొమ్మలే వెయ్యలేదు. అగ్రవర్ణం కనుక.
బ్రహ్మీ: చిత్రకారుడు తనకి నచ్చిన బొమ్మలు వేసుకుంటాడు. మీరు చెప్పిన బొమ్మలు వెయ్యాలంటే ఎలా సార్!
ఎర్ర కూజా: నేను లెఫ్టే కానీ నేను చెప్పేదే రైటు.
వివాహ భోజనంబు అన్న పాటలో గిరిజనుడైన ఘటోత్కచుడి చేత అగ్ర వర్ణ అరిసెలు,అప్పడాలు తినిపించారు. పాట రాసిన పింగళి అగ్రవర్ణం కనుక.
బ్రహ్మీ: అదేంటి సార్, రెండు రాజ కుటుంబాల మధ్య జరుగుతున్న పెళ్ళిలో వియ్యాల వారి కోసం చేయించిన రాచ వంటకాలు కదా ఘటోత్కచుడు వచ్చి తింట? మీ ఆర్గ్యుమెంటులో లాజిక్ మిస్సయ్యారు సార్!
ఎర్ర కూజా: నేను లెఫ్టే కానీ నేను చెప్పేదే రైటు. మన కవిత్వము,కళలు ఇంకా సుఖ జీవన సౌందర్యాన్నేనా చిత్రించేది?
బ్రహ్మీ: కళల్ని,కళాకారుల్ని శాసించడానికి మీరేమైనా నియంతలా సార్?
కళ అంటే మీ పార్టీ బాకా కాదేమో సార్?
ఎర్ర కూజా: నేను లెఫ్టే కానీ నేను చెప్పేదే రైటు.
బ్రహ్మీ: ఆపరా నీ సోది! చెప్పింది చాల్లే గానీ, తిరిగి చూడకుండా లెఫ్ట్ రైట్ కొట్టుకుంటా పోతా ఉండు.