ప్రేమ పచ్చళ్ళ samples- 1940 to present

 


1940 ల్లో-

హీరో: ప్రాణేశ్వరీ, హృదయ సఖీ! 
నా డెందమును ఆక్రమించిన నవ మల్లికా! 
సుకుమారీ! 

హీరోయిన్‌: ఆ,ఎంత అదృష్టవంతురాలిని!
 ప్రాణనాథా! నా హృదయమును మీకర్పించిని.
 ఇకపై నా జీవితం మీ పాదాల చెంత. 

1960ల్లో-

హీరో:  రాధా, నేను మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మనసు పారేసుకున్నాను. 
మీకు ఇష్టమైతే మీ మెడలో తాళి కట్టి నాదాన్ని చేసుకుంటాను.

హీరోయిన్‌: రామూ, మీరంటే నాకూ ఇష్టమే. 
మన పెద్ద వాళ్ళను ఒప్పించి ఒకరికి ఒకరమై తోడూనీడగా కొత్త సంసారాన్ని ఆరంభిద్దాం. 
మన సంసారం పిల్లాపాపలతో కళకళలాడాలి.

1980ల్లో- 

హీరో: మనల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ విడదీయలేరు. 
రా,రాధా, ప్రేమ ప్రభంజనం సృష్టిద్దాం. 
మన ప్రేమ అనంతం! 
అజరామరం! 
ఈ ప్రేమ హీన, రస హీన ప్రపంచం నుండి దూరంగా వెళ్ళి పోయి ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించుకుందాం పద రాధా,పద!

హీరోయిన్‌: అలాగే రామూ, మన ప్రేమ వృక్షానికి అభిమానం,ఆప్యాయత అనే నీళ్ళు పోసి అది నిత్యము పచ్చపచ్చగా నవనవలాడుతూ ఉంటే చూసి ఆనందభాష్పాలు రాలుద్దాం. 
అలాగే రామూ, అలాగే. 
సూట్‌కేస్‌ సర్దుకుని ఇప్పుడే వస్తా.

1990 తరువాత- 

హీరో: ఏంటే, తెగ తిప్పేసుకుంటున్నావ్‌. పొగరా?
 నిన్ను లవ్‌ చేస్తున్నా. 
ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో, ఫో!

హీరోయిన్‌: ఏంట్రా, వాగుతున్నావ్‌. బలుపా? 
నేనూ నిన్ను లవ్‌ చేస్తున్నాబే. 
ఇదిగో ఈ తాళి నా మెళ్ళో కట్టుకో బే.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన