మాకు మేమే మహారాజులం! -2

 


లిబరల్‌ అంటే ఎవురన్నియ్యా?


మన పూజల మీద, 
మన పండగల మీద,
మన పద్ధతుల మీద,
మొత్తం మన మీద మనకే అసయ్యం పుట్టేటట్టు 
మాట్టాడి,మాట్టాడి,
పత్రికల్లో రాసి,రాసి,
సినేమాలు తీసి,తీసి 
చివరికి మనమే మనదాన్ని 
తూస్కారంగా చూసేతట్టు చేసే వాడినే 
‘లిబరల్‌’ అంటారు తమ్మీ. 

పత్రికల్లో ,సోషల్‌ మీడియాల్లో విడవకుండా చెత్తబోసేది ఈళ్ళేనా?
తిక్కలాళ్ళు తిరనాళ్ళకి బోతే ఎక్కనూ దిగనూ సరిపోయిందంట.
 
అయితే, అట్టా చేత్తే ఆళ్ళకి ఏవొస్తాదన్నియ్యా? 

మన దాని మీద గౌరవం పోయినాక-
 
సగంమంది అందరు దేవుళ్ళు ఒకటేలే అనే బాచిగా, 
సగంమంది అసలు దేవుడే లేడు అనే బాచిగా 
తయారౌతారు. 

అప్పుడు మెదటి బాచీకి వలేయడానికి మత మార్పిడి ముఠాలు,
రెండో బాచీకి వలెయ్యటానికి ఎడం చేతి వాళ్ళు వస్తారు. 

ఆళ్ళూ ఆళ్ళూ ఫ్రెండ్సా అన్నియ్యా? 

మన దేశంలో మన ధర్మం పోయిందాక కల్సి పన్చేసి,
 ఆ పనయ్యాక వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు. 
వాళ్ళల్లో ఎవరు పవరులోకొచ్చినా ఇంకోళ్ళని రానీరు. 

అప్పటిదాకా,
 గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్య పోతే,
 ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందని సామెత చెప్పినట్టు, ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ కాచుకుంటూ ఉంటారు.

అట్నా? కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్టన్న మాట.
 మరియ్యన్నీ చెయ్యాల్నంటే డబ్బులెట్టా అన్నియ్యా?

విదేశాల నుండి విరివిగా రాకుంటే ఇయ్యన్నీ అవుతయ్యా తమ్మీ?

అట్నా? మరి ఈళ్ళని కట్టడి జేసేది ఎట్టా అన్నియ్యా?

తడక లేని ఇంట్లో కుక్క దూరినట్టు, మన దేశంలో చట్టాలు, వ్యవస్థా పకడుగా లేవు తమ్మీ. 

చట్టాల్లో మార్పు తెద్దామని చూసినా కానీకుండా అల్లర్లు,దొమ్మీలు చేయించే పెద్ద చేతులున్నయ్‌.

ఇంటి దొంగలన్న మాట. 
లాబం నేదు,  ఈ దేశాన్ని మనమే కాపాడాలన్నియ్యా! 

హరిశ్చంద్రుడ్ని లెంపకాయ కొట్టి పుట్టినావురా నువ్వు తమ్మీ! 
సరే, అట్నే కానీ! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి