నిజమే కానీ..
దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలనడం సమంజసమా కాదా?
నిజమే కానీ…
దేశం ప్రతి పౌరుడి వ్యక్తిగత హక్కులని కాపాడ్డం చూస్తుందా
ఒక్కో వర్గం ఆచారాలను బట్టి నడుస్తుందా?
నిజమే కానీ…
ఒకటి చెప్పు, హిందూ వివాహ చట్టం, శారదా చట్టం లాంటి చట్టాలన్నీ హిందువులను అడిగే చేసారా?
నిజమే కానీ…
చట్టాలు చేస్తున్నప్పుడు ఇవి హిందూ శాస్త్ర గ్రంథాలకు అనుగుణంగా ఉన్నాయా అని ఎవరినైనా సంప్రదిస్తున్నారా?
నిజమే కానీ..
అన్నింటికీ అలా నట్లు కొడతావే?
నేను చెబుతుంది సబబుగా ఉందా లేదా?
సరిగ్గా చెప్పు?
నిజమే కానీ…