పోనీ పోనీ పోతేపోనీ!

 


భయ్యా, నా విఫలప్రేమలు తల్చుకుంటే ఏడుపొస్తాంది భయ్యా! 

ఏడో తరగతిలో ఒకమ్మాయిని ప్రేమించా. 
ఆ పిల్లకి పదో తరగతిలోనే పెళ్ళైపోయింది.

పదో తరగతిలో ఒకమ్మాయిని ప్రేమించా.
 ఆ పిల్లకి ఇంటర్‌లోనే పెళ్ళైపోయింది. 

డిగ్రీలో ఒకమ్మాయిని ప్రేమించా. 
ఆ పిల్లకి ఫైనల్‌ ఇయర్‌లోనే పెళ్ళైపోయింది. 

నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఓ పిల్లని ప్రేమించా. 
నాకు ఉద్యోగం రాలేదు గానీ ఆ పిల్లకి ఉద్యోగం వచ్చి ఇంకో ఉద్యోగస్థుడిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. 

ఉద్యోగం వచ్చాక ఆఫీసులో ఒకమ్మాయిని ప్రేమించా. 
ఆ పిల్ల మతం మారమని గోల చేస్తే ఆ గోల తట్టుకోలేక నేనే వదిలేసా. 

మొన్నటి వరకూ పక్కింటి అమ్మాయిని ప్రేమించా.
 ఆ విషయం ఆ పిల్లకి చెబ్దామని వెళితే, ఆ పిల్ల మా పక్కింటి వాడిని ప్రేమిస్తోందని తెల్సింది భయ్యా! 

గుండె ముక్కల్‌ ముక్కల్‌ ఐపోతాంది భయ్యా! వా!..


సాటి వాళ్ళతో సరిగంగ స్నానాలు చేస్తాంటే ముసలి మొగుడ్ని మొసలెత్తుకు పోయిందంట. అట్టుంది తమ్మీ నువ్‌ జెప్పేది.

కాస్త కంటికి నదరగా కన్పించిన ప్రతి పిల్లనీ పనీపాట లేక ప్రేమించుకుంటా పోయావ్‌. 

ఒకడి అన్నం ఒకడికవ్వుద్దేమో గానీ ఒకడి ఆలి ఒకడికవ్వదు తమ్మీ.

ఎవ్వరైనా సరే ఏదో పూర్వజన్మ ఋణం ఉంటేనే మన జీవితాల్లోకి వస్తారు తమ్మీ, అది భార్యగానీ, పిల్లలు ‌గానీ, స్నేహితులు గానీ. 

ఋణం లేకపోతే రారు, 
ఋణం తీరిపోతే ఉండరు. 

ఇది తెల్సుకున్నావనుకో, అంతా హాపీస్‌. 

అయితే భయ్యా, మనిద్దరికీ ఋణం ఉండబట్టే ఇట్టా కల్సి మందేస్తన్నామా భయ్యా?

అంతేగా మరి. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన