నా రూటే సెపరేటు!

 


పెడ బాబు: ప్రబంధ సాహిత్యం అంతా బూతుల బుగ్గలు. 
మా బావ కవిత్వం, ఆధునిక కవిత్వం వచ్చి దాన్ని బూస్థాపితం చేసినయ్యి.

సామాన్యుడు: ఆ పుస్తకాలు ఎవరో కొద్దిమంది చదివేవాళ్ళు. 
 సినేమా విప్లవం వచ్చి ఊరూరా ఆబాలగోపాలానికీ అంతకన్నా ఎక్కువ బూతు చూపించబడుతోంది. 
బావ కవిత్వం బావలు కూడా అందులోకి వెళ్ళి బావలు సయ్యా అని డబ్బు కోసం పాటలు, మాటలు రాసేరు.
దాన్ని మీరు ఆపడానికి ఏ ప్రయత్నం చెయ్యలేకపోయారే? 

పెడ బాబు: అదంతా నీకర్థం కాదు. నేను మేధావిని.
పీడితులను చైతన్యపరిచి భూస్వామ్యాన్ని భూస్థాపితం చేసాం.

సామాన్యుడు: వ్యవసాయానికి మంగళం పాడి రియల్‌ ఎస్టేట్‌ వైపు మూడు పువ్వులు ఆరుకాయలుగా వెళుతోంది భూస్వామ్యం. కనిపించడం లేదా? 

పెడ బాబు: అదంతా నీకర్థం కాదు. నేను మేధావిని.
స్త్రీవాదంతో వివాహ వ్యవస్థను షేక్‌ చేసాం.

సామాన్యుడు: కేసులు, విడాకులు, సహజీవనాలతో  స్త్రీ మరింత దగా పడడం లేదా?

పెడ బాబు: అదంతా నీకర్థం కాదు. నేను మేధావిని.
ఎంతోమంది యువతీయువకుల్ని చైతన్యపరచి, మావైపుకి లాక్కుని, మా భావజాలం నూరిపోసి, వెనకాల మేముండి, వాళ్ళని పోరాటాల్లో ముందు నిలుపుతూ నడిపిస్తున్నాం.

సామాన్యుడు: మీ మాటలు ఎక్కించుకుని ఎంతోమంది ముక్కు పచ్చలారని నూనూగు మీసాల నూత్న యవ్వనులు,హీరోలమనే భ్రమలో, తెలిసీ తెలియని సగం సగం నాలెడ్జితో వచ్చిన ఆవేశాలతో మీరు ఉసిగొల్పే పోరాటాల్లో సమిధలౌతున్నారు.

పెడ బాబు: అదంతా నీకర్థం కాదు. నేను మేధావిని.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి