The great Revenge

 


ఏం తమ్ముడు, రెబల్‌ స్టార్‌ రాకేష్! ‌‌ ఏంటలా డల్‌ గా ఉన్నావ్‌‌? 


నేను Active గా ఉండే నాలుగు Whatsapp groups లోంచి నన్ను తీసేసారు,భయ్యా. చానా భాధగా ఉంది. 

అయ్యో, అలాగా? ఎందుకో? 

“వెలుగు దేశం” group లో మీ నాయకుడికి మంచి తెలుగు ట్యూషన్‌ మాస్టర్‌ని పెట్టించండి అని సలహా ఇచ్చా.

అంతే, Group నుండి తీసేసారు.

“బులుగు దేశం” group లోకి వెళ్ళి మీ ఉచిత ఊరగాయ పథకాలు పుట్టి ముంచుతాయని సుద్దులు చెప్పా. 


అంతే,Group నుండి తీసేసారు.


“ఎరుపు దేశం” group లోకి వెళ్ళి మీ ఎర్ర కళ్ళజోళ్ళు తీసేసి చూడండి లోకాన్ని అని హితవు పల్కా. 


అంతే,Group నుండి తీసేసారు.


“తెలుపు దేశం” group లోకి వెళ్ళి మీ నాయకుడికి ముందు soft skills, Public behavior courses లో చేర్చి training ఇప్పించండి, అతగాడు కన్ను కొట్టడం మానేస్తే మీకు మేలు జరుగుతుందని బోధించా. 
 

అంతే, Group నుండి తీసేసారు.

అంతే,భయ్యా.అంతే. 

నా voice వినిపించాలనుకోడం తప్పా భయ్యా? 
చెప్పు భయ్యా? 

Groups నుండి నిర్దాక్షిణ్యంగా తీసేసారు భయ్యా! 
చానా అవమానంగా ఉంది భయ్యా!


యదార్ధవాది లోకవిరోధి అని ఊరికే అనలేదు తమ్ముడూ. 

నువ్వు revenge తీర్చుకోవాలంటే ఒక పని చెయ్యి. 

ఈ WhatsApp group admins అందర్నీ కలిపి 
నువ్వే ఓ WhatsApp group తయారు చెయ్యి.  

ఆ group కి ట్రిపుల్‌ ఎక్స్ మంచి సంస్కారవంతమైన soap లాగా 
ఓ మంచి పేరు పెట్టు. 

రెండ్రోజులు శుభోదయాలు, శుభ సాయంత్రాలు చెప్పి 
తర్వాత ఒక్కొక్కడినీ group నుంచి నువ్వే తీసెయ్‌. 

అంతే, సింపుల్‌! టిట్‌ ఫర్‌ టాట్‌! 

నాల్రోజులయ్యాక- 

భయ్యా, నువ్వు చెప్పినట్టే బడ్వైజర్‌ బడ్డీస్‌ అని WhatsApp group start చేసి, రెండ్రోజులయ్యాక ఒక్కొక్కడినీ group నుండి తీసేస్తుంటే, అబ్బా! ఆ కిక్కే సూపర్‌గా ఉంది భయ్యా! 

అంటూ ఆనందపడి పోయాడు, మన రెబల్‌ స్టార్‌ రాకేష్. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన