మాకు మేమే మహారాజులం-3

 


అన్నాయ్‌, జనాలు కులాలు పోవాలనుకుంటున్నారా? 

లేదు తమ్మీ. 
తమ కులానికి గౌరవం కావాలని కోరుకుంటున్నారు.
కుదిరితే తమ కులం నెం.1 కావాలని,
 రాజ్యాన్ని ఏలాలనీ కోరుకుంటున్నారు. 

అన్నాయ్‌, జనాలు మతాలు పోవాలని కోరుకుంటున్నారా? 

లేదు తమ్మీ. 
తమ మతంలోకి ఎక్కువ మంది రావాలని,
వీలైతే ప్రపంచమంతా తమ మతంలోకి మారిపోవాలని 
చాలా మతాలవారు కోరుకుంటున్నారు. 

అన్నాయ్‌, జనాలు అవినీతి పోవాలని కోరుకుంటున్నారా?

లేదు తమ్మీ. 
తాము తింటే తప్పు లేదుగానీ నాయకులు మాత్రం 
నిజాయితీగా ఉండాలనుకుంటున్నారు. 

అన్నాయ్‌, జనాలు చట్టాలను గౌరవిస్తున్నారా?

లేదు తమ్మీ. 
పరాయి పాలనలో చట్టాలను తప్పించుకుని తిరగడం ఎలా గొప్ప అయిందో, 
మన ప్రభుత్వ పాలన వచ్చాక కూడా ప్రజల్లో అదే mindset ఉండిపోవడం వల్ల,

ఇది మన దేశం,
 మన ప్రభుత్వం,
మనం పెట్టుకున్న చట్టాలు 
అన్న స్పృహ లేకపోవడం వల్ల,

ఎవరికీ దొరకనంత వరకు అడ్డదారులు ఓకే అనుకుంటున్నారు.

అన్నాయ్‌, జనాలు నచ్చిన దుస్తులు వేసుకునే ఆడవారిని అది వారి స్వేచ్ఛ అని గౌరవిస్తున్నారా?

లేదు తమ్మీ. 
అది వారి స్వేచ్ఛ అని అదర్శాలు చెప్పే జనాలకి కూడా 
కావాల్సింది వారి కళ్ళకి వినోదం. 

అన్నాయ్‌, ఇంకో కొచ్చిను..
 
ఇంక చాల్లే తమ్మీ, మళ్ళీ రేపు పెట్టుకుందాం రచ్చబండ.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5