మాకు మేమే మహారాజులం-4

 

అన్నాయ్‌, ఈమధ్య అన్నింటికీ వివక్ష అని విపరీతంగా ఊదరగొడతాంటే అయోమయంగా ఉంది. 
అసలేందన్నాయ్‌‌ ఇదంతా? 

ఎంపిక చేసుకునే స్వేచ్ఛని, వివక్ష ని గడబిడగా కలిపేసి 
అన్నింటినీ వివక్ష అనుకుంటున్నారు తమ్మీ.

 ఒకమ్మాయి ఆరడుగులున్న అబ్బాయిని  పెళ్ళి చేసుకుంటానని ప్రకటించిందనుకో. 

అది ఆమె choice లేక ఎంపిక చేసుకునే స్వేచ్ఛ.

అప్పుడు తక్కువ ఎత్తున్న మగవాళ్ళంతా వచ్చి నువ్వు మాపట్ల వివక్ష చూపిస్తున్నావు అంటే?  

భలే చెప్పావన్నాయ్‌! 



అన్నాయ్‌, ఆయనెవరో మెగా మేతావంట, 
పెట్టుబడిదారు లాభాలన్నీ అందరికీ సమానంగా పంచి తను కూడా నెల జీతం తీసుకోవాలంటున్నాడు. 
ఏందన్నాయ్‌ ఇది? 

పెట్టుబడిదారుడు ఎంతో పెట్టుబడి పెట్టి, 
ఎంతో రిస్కు తీసుకుని పరిశ్రమ ఎందుకు స్థాపిస్తాడు? 
అంత కష్టపడి ఎందుకు నడిపిస్తాడు? 
లాభాలు సంపాదించి ఆ డబ్బుతో గొప్ప స్థాయిలో బతకాలనేగా?

మరి ఆ ఆశ, drive లేకపోతే వాడెందుకు పరిశ్రమ స్థాపిస్తాడు? దాన్నెందుకు తన సమస్త శక్తులు ఒడ్డి నడిపిస్తాడు?

అందరికీ పందేరం చేసి తాను నలుగురితో పాటు బతికేదానికి ఇంత శ్రమ అతనెందుకు పడాలి?

అభివృద్ధి కావాలంటే ఆ మండే కోరిక, ఆ కోరిక వెనక తనకు రాబోయే లాభాలు ఉంటేనే ఇదంతా సాధ్యం. 

భలే చెప్పావన్నాయ్‌!


అన్నాయ్‌, ఆయనెవరో ఎర్ర మేతావంట, మేధో శ్రమ, శారీరక శ్రమ విభజన లేకుండా అందరూ అన్ని పనులు పంచుకుని చెయ్యాలంటన్నాడు.
ఏందన్నాయ్‌ ఇది? 

ఏరకమైన శ్రమ చేయగలిగిన వ్యక్తి ఆరకమైన శ్రమ చేయడమే వ్యక్తికి, సమాజానికి లాభం. 

ఒక పరిశోధనశాలలో శాస్త్రవేత్తలు, వారి బాత్రూములు అవి శుభ్రం చేసే పనివారు, ఇంకా వంటవారు ఇలా ఉన్నారనుకో. 

అన్ని పనులు అందరూ పంచుకోవాలంటే శాస్త్రవేత్తల పని, అక్కడ శారీరక పని చేసే మిగిలిన వారు పంచుకోలేరు. 

పోనీ, శాస్త్రవేత్తలు లాబ్‌లో మేధోశ్రమే ఎందుకు చెయ్యాలి అని వారి చేత రోజూ ఓ గంట వంట చేయించడమో, బాత్రూంలు శుభ్రం చేయించడమో చేసామనుకో, 
ఆ మేరకు, అన్ని గంటలు, పరిశోధనలో గడపవలసిన శాస్త్రవేత్తల సమయం వృధా అవడమే కాదు, సమాజానికి కూడా విలువైన వనరులు వృధా అయినట్టే. 

అదే సమయాన్ని వారు పరిశోధనలో వెచ్చిస్తే, మానవాళికంతటికీ పనికొచ్చే ఏ మందో కనిపెట్టగలరు. 
అప్పుడు ఆ ఫలాలు పొందే వారిలో అక్కడ పరిశోధనశాలలో శారీరక శ్రమ చేసేవారు, వారి కుటుంబాలు కూడా ఉంటాయి. 

భలే చెప్పావన్నాయ్‌!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన