చలిగాలి కొట్టిందమ్మా అందిట్లో!
హాయ్,తిలకావతీ! ఎలా ఉన్నావ్?
ఫేస్‌బుక్ ఫ్రెండ్ కీరవాణిని పెళ్ళి చేసుకున్నావ్.
అంతా హాపీయేనా? అడిగింది మధ్యమావతి.
అతనొక ఫ్రాడ్. అందుకే వదిలేసా.
అయ్యో, అలాగా. ఏం జరిగిందే?
Facebook లో నేను కెమెరా వైపు ముద్దు పెడుతున్నట్టుగా పెట్టిన ఫొటోకి అతను కామెంట్ పెట్టడంతో మొదలైంది మా ప్రేమ.
తిలకాలతి
తిలకాలతి
నీ ఎర్రని
మూతి
పోయింది
నా మతి
అన్న కామెంట్ చూసే ప్రేమించా.
పెళ్ళైన వెంటనే FB లోంచి ఆ ఫొటో తీసెయ్యమని బ్రతిమిలాడాడు.
నాకు తిక్క రేగి తగాదా వేసుకున్నా.
నేను స్త్రీవాద కథలు రాస్తానని తెలుసు కదా.
పెళ్ళి కాక ముందు వాటికి లవ్సు లైక్సు కొట్టేవాడు.
పెళ్ళైన తరువాత నా కథలు ఎప్పుడూ చదవలేదనీ, ఊరికే నన్ను ఇంప్రెస్ చేయడానికి లైక్స్ కొట్టేవాడినని చెప్పాడు.
నాకు ఒళ్ళు మండిపోయి తగాదా వేసుకున్నా.
స్త్రీవాద సభలకు వెళుతున్నానంటే నన్ను మెచ్చుకుంటూ FB లో కామెంట్స్ పెట్టేవాడు, పెళ్ళికాక ముందు.
పెళ్ళయ్యాక, ఇంట్లో పనంతా వదిలేసి నువ్విలా సభలకు సమావేశాలకు వెళితే ఎలా? ఆలోచించు అన్నాడు అతి తెలివి ఉపయోగించి.
నాకు పిచ్చి కోపం వచ్చి తగాదా వేసుకున్నా.
అలా రోజురోజుకు నా ఆశయాలకు అడ్డుపడుతున్నాడని వదిలి పారేశా.
అవునా? అతనికేమైనా చెడ్డ అలవాట్లున్నాయా?
లేవు.
అతనికి ఉద్యోగం లేదా?
ఆ, IT లో ఉన్నాడు.
అతనికి దైవభక్తి ఉందా?
ఆహా! బోల్డంత. నేను దేవుడ్ని నమ్మను, పూజలు చెయ్యను.
అతను రోజూ పూజ చెయ్యనిదే కాఫీ కూడా తాగడు.
ఓ ఆర్నెల్లయ్యాక-
మధ్యమావతి కీరవాణితో తన పెళ్ళి ఫొటోల్ని ఫేస్‌బుక్‌లో post చేస్తే,
అవి చూసిన తిలకావతికి చలీ,జ్వరమూను.