కిందిస్థాయి వాళ్ళకి అర్థం కాదు సార్!
హబ్బ! ఆ కవితలో డాక్టర్ పారాయణ గారు ఆ మాట ఎంత బాగా రాసారో?
కాలువ
కల కన్న
కలలోని
కల అని!
కాలువేంటి?
కల మళ్ళీ కలగనడమేమిటి సార్?
అర్థం కాలా?
అది కిందిస్థాయి వాళ్ళకి అర్థం కాదు.
ఓహో!
హబ్బ! ఆ కవితలో డాక్టర్ మల్లయ్య గారు ఆ మాట హెంధ భాగా రాసారో?
కడుపుతో ఉన్న ఊహ
తను కన్న తన పిల్ల ఊహని
చూసుకొని మురిసిపోవడమే
ఈ జగతికి వసంతోత్సవం అని!
ఊహ కడుపుతో ఉండి పిల్ల ఊహను కనడమేమిటి సార్?
అంతా కన్ఫూజన్‌గా ఉంది!
అది కిందిస్థాయి వాళ్ళకి అర్థం కాదు.
ఓహో!
హబ్బ! ఆ కవితలో డాక్టర్ బాదూషా గారు ఎంథ బాగా రాసిండో?
దబ్బనంతో
కళ్ళు పొడుచుకున్నా
కానరాని చీకట్లను
ఫోర్క్ తో గుచ్చుతున్నది
నీ చేయి కామ్రేడ్!
రక్తసిక్త వందనాలు!
శవాన్ని తొక్కుతూ
కదం తొక్కుదాం పద!
దబ్బనం ఏమిటి? పొడుచుకోవడమేమిటీ?
శవం ఏమిటి సార్? భయం వేస్తోంది.
అది కిందిస్థాయి వాళ్ళకి అర్థం కాదు.
ఓహో!
సరే సార్, నేను కిందిస్థాయి వాడినే. మరి ఎలాంటి వాళ్ళకి అర్థం అవుతుందంటారు?
అని అడిగితే ఇలా వైనంగా చెప్పాడు-