యోగరతోవా భోగరతోవా

 


గురువు గారు, ఆ రోజుల్లో మీరు నైమిశారణ్యంలో కొన్నేళ్ళు,
 కాశీలో కొన్నేళ్ళు తపస్సు చేసి వచ్చారు కదూ? 

అంతా దైవలీల

గురువు గారు, మొదట్లో బీదరికాన్ని అనుభవించినా ఆ తరువాత అనేకమంది శిష్యులతోబాటు ధనాన్ని, కీర్తిప్రతిష్ఠలని సంపాదించుకున్నారు, ధన్యులు మీరు!

అంతా దైవానుగ్రహం

మీ చిన్నవాడు నా ఈడువాడే. 
నడివయసులోనే మీ కళ్ళ ముందే వెళ్ళిపోయాడు.
 పుత్రశోకాన్ని ఎలా దిగమింగారో?

అంతా దైవనిర్ణయం

మీ భార్య గారు మీకన్నా ముందే వెళ్ళిపోయారు. 
మీరిలా స్వయంపాకం చేసుకుంటూ వంటరిగా బ్రతుకుతున్నారు పాపం.

అంతా దైవమాయ

అన్నింటికీ దైవమేనా గురువుగారు? 

యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ!


అహా! ఏమి చెప్పారు,గురువుగారు!
 ధన్యోస్మి! 
నమోనమః 🙏


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5