ఇడ్లీ,రవ్వ ఇడ్లీ,గారె,మసాలా గారె


ప్రభుత్వం: అమ్మ ఉచిత పథకం, అక్క ఉచిత పథకం,చెల్లి ఉచిత పథకం,పెద్దమ్మ ఉచిత పథకం,పెదనాన్న ఉచిత పథకం,అత్తమ్మ ఉచిత పథకం,నానమ్మ ఉచిత పథకం…

ప్రతిపక్షం: పాదయాత్ర,కాలి యాత్ర,మోకాలి యాత్ర, చెప్పులతో యాత్ర,చెప్పుల్లేకుండా యాత్ర, హర్తాళ్ళు,రైల్‌ రోకోలు, బస్సు రోకోలు,రిక్షా రోకోలు,బందులు,రోడ్‌ షోలు,గల్లీ షోలు,బుల్లీ షోలు….

గృహిణి: కంచిపట్టు చీర,బనారస్‌ చీర,ఉప్పాడ చీర,వెంకటగిరి చీర,చీరాల చీర,ఎంబ్రాయిడరీ చీర,మధుర చీర,తమిళనాడు చీర,బెంగాల్ కాటన్‌ చీర,లక్నో చీర,పైతానీ చీర, టెంపుల్‌ డిజైన్‌ చీర, సిల్కు చీర,కాటన్‌ చీర…

NRI : హ్యూస్టన్‌లో ఇల్లు, డాలస్‌లో ఇల్లు, ఫ్రిస్కోలో ఫామ్‌హౌస్‌, ప్లేనోలో స్థలము, ఆస్టిన్‌ లో రాంచు,హైదరాబాద్ లో ఇల్లు,బెంగుళూరులో ఇల్లు..


సాఫ్ట్వేర్‌ ఉద్యోగి: morning meeting,afternoon meeting,evening meeting,offshore meeting,onshore meeting,team meeting,war room meeting,Teams meeting,zoom meeting…


ఇదంతా చూస్తున్న సుబ్బారావుకి జంధ్యాల గారి సిన్మాలో సీను గుర్తొచ్చింది. గుర్తుకు రాగానే నవ్వొచ్చింది. 
 నవ్వు అలా అలా పెరిగి పెరిగి కిందపడి దొర్లసాగాడు. 

ఆ తర్వాత, మహానుభావా!జంధ్యాలా! ఏ స్వర్గంలో ఉన్నావయ్యా! 
అని ఆకాశం వైపుకి దణ్ణం పెట్టి ఇంటికి పోయాడు.


మీరు కూడా చూడండి.
 చూసాక వెనక్కి వెళ్ళి అదే ట్యూనులో పైన రాసిందంతా మళ్ళీ చదవండి: 😊

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5