కవి గారి ప్రేయసి

 


ప్రేమించి మరీ చాముండేశ్వరిని పెళ్ళి చేసుకున్నావ్‌. 
ఎలా ఉందిరా నీ వైవాహిక జీవితం? 
అడిగాడు కవి కుమార్‌ని అతడి స్నేహితుడు. 

అంతా అస్తోబిస్తో అయిపోయిందిరా. 

పెళ్ళైన మొదటి రోజు-

ముక్కెర తళుక్కు

నీ చిలుక ముక్కు

అది నాకొక చిక్కు


అని తన మీద కవిత చదవబోయా. 

నా ముక్కు మీకొక చిక్కా? 
అంటే నా ముక్కు బాలేదనేగా మీరు చెప్పేది? 
అని అలిగి గొడవ పెట్టుకుంది.

చిక్కు అని ఎందుకన్నావురా?

రొమాంటిక్‌ గా ఉంటుందని అలా అన్నా. 
అది తను అపార్థం చేసుకుందిరా! 

ఇంకోసారి మళ్ళీ ఏదో సరసమాడదామని-


వేసావు 
నా మనసుకు కళ్ళెం
కోరికకు గొళ్ళెం
నీ మది బంగారు పళ్ళెం 

అని కవిత ఝామ్మని చెప్పా. 

అంతే! బంగారు పళ్ళెం చేయిస్తావా! చస్తావా! అని కూర్చుంది.

ఆ రోజంతా విసవిసలతో రుసరుసలతో ముగిసింది.

ఓ రోజు ఆఫీసు వెళ్ళబోతుంటే షర్టు గుండీ ఊడిందని,
 తనని గుండీ కుట్టమని రొమాంటిక్‌ గా అడుగుదామని-


చాముండీ
చాముండీ
ఊడింది
గుండీ!

కుడతావా
నా పూలకుండీ!
కొనిపెడతా
ఆర్గండీ!

అని సరదాగా కవిత్వం ఒలకబోశా.

వారం నుండీ పట్టు చీర కొనమని అడుగుతుంటే ఆర్గండీ కొంటానంటారా అంటూ అలిగి వెళ్ళిపోయింది. 

మరి గుండీ కుట్టిందా? 

గుండీ ఏంట్రా గుండీ? 

ఇతగాడు నన్ను కవిత్వంతో హింసిస్తున్నాడని పుట్టింటికెళ్ళి కేస్‌ పెట్టిందిరా! వా!

అయ్యయ్యో! మరి ఇప్పుడేం చేస్తున్నావురా?

తనను తిరిగి రమ్మని నా కవిత్వంతో ఉత్తరం రాస్తున్నా చూడు-

చాముండీ
చాముండీ
సుర సుర
నిప్పుల చండీ!

నా మనసు పిండీ
నువ్వెళ్ళి పోయాక
నా గుండె మండీ
….

రేయ్‌!రేయ్!రేయ్‌! ఆపరా, నీ కపిత్వం! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన మతమసలే పడదోయ్‌!

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పండుగంటే ఆరాధన