దడా పుట్టిస్తా నీకు దడా పుట్టిస్తా!
దర్శకుడు,నిర్మాత కారులో వెళుతుంటే, దర్శకుడు నిర్మాతకి కొత్త సినిమాకి కథ ఐడియా ఇస్తున్నాడు.
మన సిన్మా పేరు “నల్లి బొక్కల ప్రేమకథ”.
అదేంటయ్యా? అదేం పేరు?
అదే వెరైటీ సార్! మన సిన్మా స్టోరీకి మాచ్ అయ్యే పేరు.
మన సిన్మాలో హీరోయిన్ అగ్రహారంలో ఉండే బ్రామ్మిన్ అమ్మాయి.
హీరో మటన్ కొట్టు కోస్తాన్.
అదేంటయ్యా? జనాలు accept చేస్తారంటావా?
అలాగే ఉండాలి సార్!
హీరోకి హీరోయిన్‌కి ఎంత వ్యత్యాసం ఉంటే అంత పండుతుంది.
బీద హీరో - డబ్బున్న హీరోయిన్
తోటమాలి హీరో - రాకుమారి హీరోయిన్ ఇలాగన్న మాట.
ఇక్కడ మన బ్రామిన్ హీరోయిన్ ప్యూర్ వెజిటేరియన్,
మటన్ కోస్తాన్ ప్యూర్ నాన్-వెజ్.
హీరోయిన్ బాగా చదువుకుంది,
కోస్తాన్ కి చదువు లేదు.
ఇంకా, ఇలా అన్నీ తేడాలే.
ఆఖరికి హీరోయిన్‌కి దైవభక్తి ఎక్కువ,
హీరో నాస్తికుడు.
అంతేకాదు సార్, వారానికి ఒకసారి స్నానం చేస్తూ 24 గంటలు సారా మాత్రం తాగుతుంటాడు.
ఆ హీరోని మన హీరోయిన్ ప్రేమిస్తుంది.
అదేంటయ్యా? జనాలు accept చేస్తారంటావా?
ప్రేమకు లాజిక్కులుండవు సార్!
ఈ విషయంలో జనాలు ఎప్పుడో కన్విన్స్ అయిపోయారు.
ఒక మగాడు, ఒక ఆడది అయితే చాలు సార్, ప్రేమించుకోవచ్చు.
మగ, ఆడ అవడమే వాళ్ళ క్వాలిఫికేషను.
ఆ తర్వాత, వీళ్ళిలా ప్రేమించుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండగా,
విలన్ ఎంట్రీ.
విలన్ ఎవరో కాదు, ఆ పిల్ల తండ్రి, పండిత పరమేశ్వర శాస్త్రి.
అతను ఓ పెళ్ళి సంబంధం తెస్తాడు. ఆ పెళ్ళి కొడుకు అగ్రహారంలో అడుగు పెట్టడానికి ముందే మన మటన్ కోస్తాన్ అతడిని తన మటన్ కత్తితో బెదిరించి వెనక్కి పంపుతాడు.
దాంతో మన హీరోయిన్‌కి మటన్ కోస్తాన్ మీద ప్రేమ మరింత పెరుగుతుంది.
ఇదంతా తెలుసుకున్న మన విలన్ పరమేశ్వర శాస్త్రి కత్తులు, కటార్లతో కొంతమంది పండితుల్ని తీసుకుని ఫైటింగ్ కి బయల్దేరతాడు.
అదేంటయ్యా? జనాలు accept చేస్తారంటావా?
సినిమా అంటే అలాగే ఉండాలి సార్! హీరోయిన్ తండ్రిని ఎంత బాడ్‌గా, క్రూయల్‌గా చూపిస్తే అంత పండుతుంది ప్రేమ కథ.
వీళ్ళంతా ఇలా దాడి చేసినప్పుడు మటన్ కోస్తాన్ వేరే పనిలో ఉండి తమ మటన్ కత్తి దగ్గర పెట్టుకోక పోవడం వల్ల వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటాడు. అప్పుడొక పాట, స్లో మోషన్‌లో.
ప్రేమా ప్రేమా!
గెలిచేనా ఈ ప్రేమా!
ప్రపంచాన్ని
ఎదిరించి
ఖగోళాన్ని
కదిలించే
ఈ ప్రేమ
…
ఈ టైపులో ఒక పాట.
చివరికి విలన్ గాంగ్ పండితులు ఊరు విడిచి వెళ్ళిపోవడం, మన హీరోయిన్‌తో, మటన్ కోస్తాన్ పెళ్ళి, కోస్తాన్ ఇంటి సంప్రదాయం ప్రకారం చేసుకుని హీరోయిన్ తన పతిభక్తిని చాటుకుంటుంది.
మరి కామెడీ లైను?
అగ్రహారంలో ఉంటే ఇద్దరు పండితుల్ని కమెడియన్లు చేసి, వాళ్ళ పంచెల మీద, పిలకల మీద, భాష మీద జోకులు రాయిద్దాం సార్!
గొడవలౌతాయేమోనయ్యా?
భలే వారే సార్! మిగతా ఏ community అయినా problem అవుద్దిగానీ వీళ్ళ మీద జోకులేస్తే ఏ problem ఉండదు సార్!
ఇది ఇప్పటిది కాదు సార్, మాయాబజార్ సినిమాలో శర్మ,శాస్త్రి అని హస్యగాళ్ళకి పేర్లు పెట్టడంతోనే మొదలైంది సార్!
ఇంకో సంగతి సార్, ఎవరైనా బ్రామిన్ సంఘం వాళ్ళు నిరసన ప్రకటిస్తే వాళ్ళంతా కులమౌఢ్యం గాళ్ళని, ఈ కథ ప్రేమకి కులం,మతం, చదువు,అంతస్తు ఏవీ అడ్డం కావనీ చెప్పే అపురూపమైన ప్రేమ కథ అని మన పర్వర్టెడ్ తెలుగు రచయితల చేత ప్రకటన చేయిస్తాం.
సరేనయ్యా. బానే ఉంది. హీరోయిన్ గా north India నుండి తురుష్కాని తెద్దాం. మరి హీరో?
హీరో చుంచు మదన్ బాబు మటన్ కోస్తాన్‌గా బాగా సరిపోతాడు సార్!
చుంచు మదన్ బాబా? అతనెలా?
అతనిది దొంగ కోళ్ళు పట్టే మొహం.
అతనైతే correct గా సరిపోతాడు సార్!
ఇలా మాటలు నడుస్తుండగానే కారు ఖైరతాబాద్ వినాయకుడి ముందుకు వచ్చింది.
గణపతి ఆగ్రహంతో, రేయ్, పనికిమాలిన ఎదవల్లారా! అని కారు మీద కాలేసి తొక్కగానే మన అధమాధమ జగత్ దర్శకనిర్మాతలకు పిసురెళ్ళి కారుతో సహా పాతాళంలోకి పోయి పడ్డారు.
వెనకాల గణేష మంటపంలో, దడా పుట్టిస్తా నీకు, దడా పుట్టిస్తా! అని గోలగోలగా బాస్ పాట.