భరత వర్షే భరత ఖండే
అబ్బా, ఇకనుండీ భారత్ అన్న పేరు వాడబోతున్నారు!
ఎంత సంతోషంగా ఉందో!
అబ్బో, ఎందుకో అంత సంతోషం?
భారత్ అంటే,
కొన్ని వేలయేళ్ళుగా ప్రాచీన భారతదేశంలో, ప్రాచీన సంస్కృతి నీడలో నివసిస్తున్న భారత ప్రజలు, దేశం కోసం ప్రాణాలర్పించిన రాజులు, కోటలు,దేవాలయాలు,రాముడు,రామాయణం,కృష్ణుడు,మహా భారతం,వివిధ భాషలు,కావ్యాలు,మహా కవులు,పండితులు ఇంకా ఎన్నెన్నో గుర్తుకొచ్చి, ఆహా ఇది కదా మన భారత దేశము అని ఒళ్ళు పులకిస్తుంది.
ఓయబ్బో, ఇండియా అంటే అవన్నీ గుర్తుకు రావా?
ఇండియా అంటే,
ఏదో చిన్న చిన్న ఆకులన్నీ కలిపి కుట్టిన విస్తరాకులాగా, నువ్వు వేరు,నేను వేరు అయినా ఏదో కలిసుంటున్నాం, నా నీళ్ళు నువ్వు లాక్కున్నావ్,నా భూమి నువ్వు లాక్కున్నావ్,నాకు దక్కాల్సింది నువ్వు తీసుకున్నావ్ ఇలా ఉంటుంది.
చాల్లేవయ్యా, పాతకాలం కబుర్లు. ఇప్పుడంతా మారిపోయింది.
ఎవడికి కావాలీ చరిత్రా? సంస్కృతీ?
తన దేశ చరిత్రని, సంస్కృతినీ మరచిన జాతి ఆత్మ గౌరవాన్ని కోల్పోతుంది. విదేశీ మతాలకు, విదేశీ సంస్కృతికీ బానిస అయి ప్రపంచంలో తన జాతి ప్రత్యేక ఉనికిని కోల్పోతుంది.
పేరు మారిస్తే సరిపోయిద్దా? డెవలప్‌మెంటు చెయ్యాలి గానీ?
పేరులోనే స్వాభిమానం,చరిత్ర, అస్తిత్వం అంతా ఉంది.
అయినా మన పెట్టుకున్న పేరు మనం మానేసి,
వాడెవడో పెట్టిన పేరుతో మన దేశాన్ని పిల్చుకోవడంలో అర్థం లేదు.
ఏ పేరైతే ఏమిటివయ్యా? ఏదో పెద్ద గొప్పలు చెబుతున్నావు?
ఏ పేరైతే ఏమిటని నీ కొడుక్కి టామీ అని పెడతావా? లేదుగా.
మీ అబ్బాయి పేరు వెతికి వెతికి మంచి పేరు, నీ సంస్కృతిని, నీ సామాజిక వర్గాన్ని, నువ్వు నమ్మే దైవాన్ని ప్రతిబింబించేలా పెడతావా లేదా?
ఇప్పుడు ఉన్నట్టుండి భారత్ అని మార్చడం అంతా రాజకీయ కుట్రలేవయ్యా!
పేరు మార్చడం ఏంటీ? పేరు మార్చడం? నేనొప్పుకోను.
ఓరి ముర్ఖశిఖామణీ! నువ్వు కోరల మార్కుడి మోచేతి నీళ్ళు తాగే రాక్షస గణంలో ఒకడిలా ఉన్నావే?