ఆకొన్న కూడె అమృతము

 


సోషల్‌ మీడియాలో నన్ను చూడు నన్ను చూడు అని అందమైన లేడీస్‌ ఫోటోస్‌ చూస్తాంటే మాయావిడ రంగు వెలసిన అంబాసిడర్‌ లాగా కనిపిస్తాంది భయ్యా!


CEO లు, Directors profiles చూస్తాంటే నా job ఏపాటి అనిపిస్తాంది
భయ్యా!

చెట్టాపట్టాలేసుకుని కపుల్స్ రకరకాల ఫొటోలు పెడతాంటే అవి చూసి మేమెంతుకు ఇలాగున్నామని అసూయగా ఉంది భయ్యా! 

చూడు తమ్మీ, దీన్నే తెలుగులో పక్కింటి పుల్లకూర రుచి అంటారు.

మన చిన్నతనంలో సోషల్‌ మీడియా ఉన్నాదా చెప్పు?

ఒక్కసారిగా మానేస్తే పిచ్చిలేస్తది గానీ,
 చిన్నగా టైము తగ్గించుకుంటా రా. 

సోషల్‌ మీడియా ఫొటోలు, కామెంట్లు,లైకులు వాట్ని సీరియస్‌గా తీస్కోమాక. 

స్లోగా తగ్గించి తగ్గించి ఒక ఆర్నెల్లు పూర్తిగా బంద్‍ చెయ్‌.

అప్పుడు నీ ఉద్యోగం మహారాజ పదవిలాగా, నీ ఇల్లు స్వర్గంలాగా, మీయావిడ నీకంటికి రంభలాగా కనిపించకపోతే నన్నడుగు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5