Mr.సరదారాయుడు
కళాభిరామ్ గారు, ఈ సెలవు రోజు ఎలా గడిచిందండీ?
ఉదయం రీటాతో పాట, మధ్యాహ్నం మీటా తో ఆట, సాయంత్రం బాటా తో సాహితీ భేటీ అయింది సార్!
ఇప్పుడే ఇంటికి పోతున్నా.
మా ఆవిడ ముందు చేతులు కట్టుకుని నించోడానికి.
చేతులు కట్టుకోవడం ఎందుకు?
ఉదయం నుండీ ఇంటి పనుల్లో సాయం చేయకుండా బయట బలాదూర్ తిరుగుతున్నానని మా ఆవిడ చిటపటలాడుతూ ఉంటుంది.
ఆవిడ్ని కూల్ చేయడానికి కాసేపు ఆవిడకి భయపడుతున్నట్టు అలా యాక్షన్ చేస్తా.
గడుసు వాడివేనయ్యోయ్!
మరి ఆ లేడీస్ ఎవరైనా నీ ఫ్రెండ్షిప్‌ని సీరియస్‌గా తీసుకుంటే?
నేను ఆటగాడిని, పాటగాడినే కాక అందగాడిని కూడా కనుక కొందరు అలా కనెక్ట్ అవుతారనుకోండి.
అప్పుడు సరదా ఫ్రెండ్ సైడునుండి ఫేస్ షిఫ్ట్ చేసి ఫామిలీ మాన్ అవతారమెత్తుతా.
మా ఆవిడని తీస్కెళ్ళి పరిచయం చేస్తా.
లేకపోతే ఆవిడ పుట్టిన రోజని, మా పెళ్ళి రోజని ఫామిలీ మాటలు చెబుతా.
అంతే! వాళ్ళే డిస్కనెక్ట్ అవుతారు.
మనకు కావాల్సింది సర్దాయే గానీ ఆబ్లిగేషను కాదు కదా సార్!
గడుసు వాడివేనయ్యోయ్!
మరి వాళ్ళు అట్నించటే వెళ్ళిపోతే?
ఈసారి ఈనా తో పాట, మీనా తో ఆట, డీకాతో సాహిత్యం!
భలే, అదృష్టవంతుడివోయ్, కళాభిరామ్!
నీవల్ల నీకు తప్ప దేశానికి,సమాజానికి ఏ ఉపయోగము లేదుగానీ,
Enjoy!